Aranya Movie : ఏనుగులను కాపాడటానికి రంగంలోకి రానా.. ఘనంగా అరణ్య ప్రీరిలీజ్ ఈవెంట్..

దగ్గుబాటి యంగ్ హీరో రానా విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇప్పటికే వైవిధ్య కథలతో సినిమాలు చేసిన రానా ఇప్పుడు అరణ్య సినిమాతో

Aranya Movie : ఏనుగులను కాపాడటానికి రంగంలోకి రానా.. ఘనంగా అరణ్య ప్రీరిలీజ్ ఈవెంట్..
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 21, 2021 | 2:54 PM

Aranya Movie : దగ్గుబాటి యంగ్ హీరో రానా విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇప్పటికే వైవిధ్య కథలతో సినిమాలు చేసిన రానా ఇప్పుడు అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రై రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిధులుగా విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల, మరో దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఈ క్రింద లైవ్ చూడండి..