AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: యూజర్లకు మరో షాక్‌ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌.. మొన్న పాస్‌వర్డ్ షేరింగ్‌, నేడు….

ఇదిలా ఉంటే ప్రారంభంలో పెద్దగా లాభాలు ఆశించని ఓటీటీ సంస్థలు ప్రస్తుతం లాభమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే యూజర్లకు వరుస షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ మొన్నటికి మొన్న పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మూడవ త్రైమాసికంగా ఏకంగా 6 మిలియన్ల మంది...

OTT: యూజర్లకు మరో షాక్‌ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌.. మొన్న పాస్‌వర్డ్ షేరింగ్‌, నేడు....
Netflix
Narender Vaitla
|

Updated on: Oct 18, 2023 | 6:30 AM

Share

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. కరోనా తర్వాత ఓటీటీలపై మొగ్గు చూపుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అంతర్జాతీయ సంస్థలు సైతం ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో కంపెనీల మధ్య పోటీసైతం పెరిగింది. పెరిగిన పోటీ కారణంగా నాణ్యమైన కంటెంట్‌ అందుబాటులోకి వస్తోంది.

ఇదిలా ఉంటే ప్రారంభంలో పెద్దగా లాభాలు ఆశించని ఓటీటీ సంస్థలు ప్రస్తుతం లాభమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే యూజర్లకు వరుస షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ మొన్నటికి మొన్న పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మూడవ త్రైమాసికంగా ఏకంగా 6 మిలియన్ల మంది కొత్త సబ్‌ స్క్రైబర్లను సాధించుకుంది. ఈ నేపథ్యంలోనే యూజర్లకు మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆదాయం పెంపే లక్ష్యంగా సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే వాల్ట్‌ డిస్నీ ఇటీవల యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం కేవలం పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితిని విధించింది. ఈ నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు పెరిగారు.

హాలీవుడ్‌ నటీనటుల సమ్మె ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట యాడ్‌ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ల చార్జీలు పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాస్‌వర్డ్ షేరింగ్‌ కట్టడి తర్వాత నెట్‌ఫ్లిక్స్‌కు సభ్యత్వం పొందిన చాలా మంది యూజర్లు యాడ్-ఫ్రీ ప్లాన్‌లను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు 6.99 డాలర్లుగా ఉండగా, యాడ్స్‌ ఫ్రీ ప్లాన్‌ ధర నెలకు 15.49 డాలర్లుగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!