Bigg Boss 7 Telugu: ఇద్దరు ఆడబిడ్డల దెబ్బకు బిత్తరపోయిన పాట బిడ్డ.. భోలేను వాయించేశారుగా..

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆ నామినేషన్స్ ను కంటిన్యూ చేశారు. నిన్న మొదటిగా శోభ శెట్టి తాను భోలే , తేజలను నామినేట్ చేసింది. భోలే తో శోభాశెట్టి పెద్ద గొడవే పెట్టుకుంది. శోభా శెట్టి నామినేషన్స్ చేస్తున్న సమయంలో భోలే మళ్లీ వెటకారంగా మాట్లాడుతూ ఆమెకు కోపం తెప్పించాడు. దానికి శోభా శెట్టి కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తూ రెచ్చిపోయింది. శోభా శెట్టిని నువ్వు బిగ్ బాస్ మోనితవి రా అని భోలే అండంతో శోభా శెట్టి సీరియస్ అయ్యింది.

Bigg Boss 7 Telugu: ఇద్దరు ఆడబిడ్డల దెబ్బకు బిత్తరపోయిన పాట బిడ్డ.. భోలేను వాయించేశారుగా..
Bigg Boss 7
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 18, 2023 | 8:31 AM

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ గరం గరం నడుస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ గట్టిగా జరిగాయి. ఎక్కువ మంది భోలే, అశ్విని కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆ నామినేషన్స్ ను కంటిన్యూ చేశారు. నిన్న మొదటిగా శోభ శెట్టి తాను భోలే , తేజలను నామినేట్ చేసింది. భోలే తో శోభాశెట్టి పెద్ద గొడవే పెట్టుకుంది. శోభా శెట్టి నామినేషన్స్ చేస్తున్న సమయంలో భోలే మళ్లీ వెటకారంగా మాట్లాడుతూ ఆమెకు కోపం తెప్పించాడు. దానికి శోభా శెట్టి కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తూ రెచ్చిపోయింది. శోభా శెట్టిని నువ్వు బిగ్ బాస్ మోనితవి రా అని భోలే అండంతో శోభా శెట్టి సీరియస్ అయ్యింది. నాకు అన్నం పెట్టిన పాత్ర మోనిత నా లైఫ్ లాంగ్ దానికి నేను రుణపడి ఉంటా.. శోభా శెట్టి అంటే ఎవ్వరికి తెలియక పోవచ్చు.. కానీ మోనిత అంటే ప్రపంచం మొత్తం తెలుసు అంటూ అరిచి గోల చేసింది.

ఇక భోలే ఏం మాట్లాడుతున్నాడో.. ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కాకుండా మాట్లాడాడు. నామినేషన్స్ చేస్తున్న సమయంలో పిచ్చిపిచ్చిగా వెటకారంగా మాట్లాడుతూ.. పాటలు పడుతూ అవతలి వారికి చిరాకు తెప్పించేలా చేశాడు. ఈ క్రమంలోనే తన పోటుగాళ్ళు టీమ్ అర్జున్ ను కూడా గెలికాడు. దానికి అర్జున్ కూడా మనోడిని ఏసుకున్నాడు. ఆతర్వాత ఆడ బిడ్డపై లవ్వు రావాలి కానీ.. నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది అంటూ తన స్టైల్ లో కౌంటర్ వేశాడు భోలే..

నేను ఆడపిల్లపై ఓడిపోయా అని పదే పదే అంటున్నావ్.. ఆటలో గెలుపు ఓటమిలు ఉంటాయి.. అంటూ ఎదో చెప్పడానికి ట్రై చేశాడు. ఇక ప్రశాంత్ నీకు బారాబర్ ఇచ్చాడు కదా అంటూ పెద్ద బూతు పదాన్ని వాడేశాడు. దాంతో ప్రియాంక సీన్ లోకి వచ్చింది. అంతకు ముందే ఈ ఇద్దరికీ నామినేషన్స్ లో గొడవ జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఆ బూతు మాట్లాడే సరికి ప్రియాంక, శోభా ఇద్దరు కలిసి భోలే పై , మాటల యుద్ధం చేశారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే వినడానికి కూర్చోలేదు అక్కడ అని ప్రియాంక అంటే మనం కూర్చోలేదు నిలుచున్నాం అని పంచ్ వేశాడు భోలే. దాంతో ప్రియాంకాకు ఇంకా మండింది. దాంతో ఆమె శోభా దగ్గరకు వచ్చి ఎం మాట్లాడుతున్నావ్ ..? బిగ్ బాస్ హౌస్ కి వచ్చి పక్కన ఆడపిల్లలు ఉన్నారన్న సెన్స్ కూడా లేకుండా బూతులు మాట్లాడుతున్నావ్ అంటూ వాయించేసింది ప్రియాంక. ఇద్దరు ఆడబిడ్డల దెబ్బకు పాపం పాటల బిడ్డ అల్లాడిపోయాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..