- Telugu News Photo Gallery Cinema photos Actress Urvashi Rautela offers reward in exchange of lost 24k gold iPhone
Urvashi Rautela: ‘నా గోల్డ్ ఐఫోన్ తిరిగివ్వండి మహా ప్రభో’.. రివార్డు ప్రకటించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా. ఇందులో స్పెషల్ సాంగ్స్‌తో ఆడియెన్స్‌ను అలరించిందామె. అలాగే అఖిల్ నటించిన ఏజెంట్‌లోనూ మెరిసింది.
Updated on: Oct 17, 2023 | 10:01 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా. ఇందులో స్పెషల్ సాంగ్స్‌తో ఆడియెన్స్‌ను అలరించిందామె. అలాగే అఖిల్ నటించిన ఏజెంట్‌లోనూ మెరిసింది.

అలాగే పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో.. ది అవతార్ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది ఊర్వశి. అల్లు అర్జున్ పుష్ప 2 లోనూ ఓ స్పెషల్ సాంగ్‌లోనూ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిలా ఉంటే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు హాజరైంది ఊర్వశి. అయితే అక్కడ తన ఖరీదైన ఐ ఫోన్ ను పోగొట్టుకుందట. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందట

తాజాగా ఈ ఫోన్‌ను తనకు తిరిగిస్తే ఓ స్పెషల్ రివార్డు ఇస్తానని సోషల్ మీడియా వేదికగా తెలిపిందీ హాట్ బ్యూటీ. అంతేకాదు తన ఫోన్ పోగొట్టుకుపోయిన లొకేషన్‌ను కూడా షేర్ చేసింది. అయితే రివార్డు మాత్రం ఎందనేది, ఎంతనేది ప్రకటించలేదు.

కాగా ఇప్పటికే ఈ విషయంపై అహ్మదాబాద్ పోలీసులకు ఊర్వశి ఫిర్యాదు చేసింది. అయితే ఊర్వశి వ్యవహారంపై నెటిజన్లు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.




