Netflix: సినీ ప్రియుల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త వెబ్‌సైట్.. పూర్తి వివరాలివే..
ఒక వారంలో వేలకొద్దీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. అందులో ఏ సినిమా బాగుంది? ఏది బాగోలేదు? అని సాధారణంగా మన స్నేహితులను, సినిమా పరిజ్ఞానం ఉన్నవారిని ఎక్కువగా
ఒక వారంలో వేలకొద్దీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. అందులో ఏ సినిమా బాగుంది? ఏది బాగోలేదు? అని సాధారణంగా మన స్నేహితులను, సినిమా పరిజ్ఞానం ఉన్నవారిని ఎక్కువగా అడుగుతుంటాం. అయితే ఇప్పుడా అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన టాప్ -10 సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా కోసం నెటిఫ్లిక్స్ ప్రత్యేకంగా https://top10.netflix.com/ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇంగ్లిష్, నాన్ ఇంగ్లిష్ కేటగిరీల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎక్కువ మంది చూసిన టాప్ రేటెడ్ కంటెంట్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షో వివరాలను పొందుపరుస్తుంది. సోమవారం నుంచి ఆదివారం వరకు స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో నమోదైన ‘స్ట్రీమింగ్ డేటా’ ( సినిమా ప్రియులు చూసిన సమయం) ఆధారంగా ప్రతి మంగళవారం ఈ టాప్- 10 లిస్ట్ రూపొందించనుంది.
పారదర్శకత కోసమే.. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరికొన్ని భాషల్లో అందుబాటుల్లోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక సినిమా లేదా వెబ్‌సిరీస్‌కి ఏయే దేశాల్లో ఎంత మేర ఆదరణ ఉందో కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం టాప్ ఫిల్మ్స్, టీవీ సిరీస్‌లకు ర్యాంకులు కేటాయిస్తోంది. ఇందులో ఇంగ్లీష్ సినిమాలు , నాన్ ఇంగ్లీష్ సినిమాలు, ఇంగ్లీష్ టీవీ షోలు, నాన్- ఇంగ్లీష్ టీవీ షోలు అనే కేటగిరీలు ఉంటాయి. స్ట్రీమింగ్ టైమ్ విషయంలో నమోదైన గణాంకాల వారీగా మరింత పారదర్శకత, జవాబుదారితనాన్ని తీసుకువచ్చేందుకే ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
We’ve had a lot of feedback about our metrics over the years.
So we went back to the drawing board and today we’re excited to launch https://t.co/a9X2usRUun — a new website with weekly global and country lists of the most popular titles on Netflix as ranked by view hours pic.twitter.com/JMrvzmRv8s
— Netflix (@netflix) November 16, 2021
Also read:
Nandamuri Balakrishna: ఆ స్టార్ దర్శకుడితో బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయనున్నారా..?
Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు తనకు మధ్య ఏముందో చెప్పేసిన సిరి..చెప్తూ తెగ సిగ్గుపడిందిగా..
Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!