Neena Gupta: పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే మస్కారా పెట్టుకోవద్దు.. నీనా ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

నీనా గుప్తా .. హిందీ సినిమాలు చూసేవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. 80వ దశకంలో తన అందం, అభినయంతో తనకంటూ ఓ గుర్తింపు..

Neena Gupta: పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే మస్కారా పెట్టుకోవద్దు.. నీనా ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 04, 2021 | 6:42 AM

నీనా గుప్తా .. హిందీ సినిమాలు చూసేవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. 80వ దశకంలో తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారీ అందాల తార. ఇప్పుడు కూడా ‘బదాయి హో’, ‘పంగా’, ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ హిందీ సినిమా ప్రియులను అలరిస్తున్నారు. అయితే వృత్తిగత జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన నీనా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో ప్రేమాయణం సాగించిన ఆమె పెళ్లి కాకుండానే గర్భం ధరించారు. మసాబాకు జన్మనిచ్చారు. అయితే ఆతర్వాత రిచర్డ్స్‌తో విడిపోయారు. దీంతో సింగిల్‌ పేరెంట్‌గానే మసాబాను పోషించారు.

కన్నీళ్లే మిగులుతాయి.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నీనా తన వ్యక్తిగత జీవితం గురించి అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్‌ చేశారు. ‘మీరు పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే ఎప్పుడూ మస్కారా పెట్టుకోకండి. నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతోందా? అసలు నేను ఎందుకు ఇలా చెబుతున్నానో మీరు అనుభవిస్తే తప్ప తెలియదు’ అంటూ పరోక్షంగా రిచర్డ్స్‌ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఎందుకంటే నీనా రిచర్డ్స్‌తో ప్రేమలో పడే నాటికే అతనికి వివాహమైంది. ఈ పోస్టుపై స్పందిస్తోన్న నెటిజన్లు ‘పెళ్లైన మగాళ్లను ప్రేమిస్తే కన్నీళ్లే మిగులుతాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Neena Gupta (@neena_gupta)

Also read:

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vijay Sethupathi: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..

Samantha: బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమంత.. ఆ స్టార్ హీరోయిన్‏తో కలిసి సామ్ భారీ ప్రాజెక్ట్..

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్