AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గ్యాంగ్ లీడర్’ వెనక్కి తగ్గాడా.?

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా ఆగస్టు 30 న విడుదల కానుండగా.. తాజాగా నిర్మాతలు రిలీజ్ డేట్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీను సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సాహో సినిమాకి లైన్ క్లియర్ చెయ్యడానికి ‘గ్యాంగ్ లీడర్’ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ కూడా రిలీజ్ […]

'గ్యాంగ్ లీడర్' వెనక్కి తగ్గాడా.?
Ravi Kiran
|

Updated on: Aug 08, 2019 | 3:03 AM

Share

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా ఆగస్టు 30 న విడుదల కానుండగా.. తాజాగా నిర్మాతలు రిలీజ్ డేట్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీను సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సాహో సినిమాకి లైన్ క్లియర్ చెయ్యడానికి ‘గ్యాంగ్ లీడర్’ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ కూడా రిలీజ్ కాబోతుంది.

ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్యారెక్టర్ కొత్తగా ఉండనుంది. మలయాళ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.