“రణరంగం” సెన్సార్ పూర్తి.. ఆగష్టు 15న విడుదల..

హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ డ్రామా రణరంగం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ మూవీకి పిళ్లై సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు సభ్యులు. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రంలో హీరో […]

రణరంగం సెన్సార్ పూర్తి.. ఆగష్టు 15న విడుదల..
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 9:30 PM

హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ డ్రామా రణరంగం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ మూవీకి పిళ్లై సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు సభ్యులు. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రంలో హీరో శర్వానంద్ పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్‌తో కూడినదై ఉంటుంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రం సొంతం. రణరంగం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు గ్యాంగ్ స్టర్ పాత్రలో శర్వానంద్ అద్భుతంగా నటించారని చెప్పారు. ఇక కాజల్, కళ్యాణి ప్రియదర్శిన్‌ల పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయని చెప్పారు.

Latest Articles
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ