‘సరిలేరు నీకెవ్వరు’పై నమత్ర కామెంట్స్..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో మహేష్ బాబు మండేస్ పేరుతో ఇప్పటికి మూడు పాటలను విడుదల చేసింది. వీటికి మిక్స్‌డ్ రియాక్షన్ వినిపిస్తుండగా.. చిత్ర యూనిట్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు […]

'సరిలేరు నీకెవ్వరు'పై నమత్ర కామెంట్స్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 17, 2019 | 7:36 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో మహేష్ బాబు మండేస్ పేరుతో ఇప్పటికి మూడు పాటలను విడుదల చేసింది. వీటికి మిక్స్‌డ్ రియాక్షన్ వినిపిస్తుండగా.. చిత్ర యూనిట్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు రంగంలోకి దిగారు సూపర్‌స్టార్ సతీమణి నమత్ర. ఈ మూవీ సెట్స్‌కు వెళ్లిన నమ్రత అక్కడ దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడితో ఫొటో తీసుకుంది. దీన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఆమె.. ‘‘మంచి దర్శకుడు అనిల్ రావిపూడి, జీనియస్ మ్యూజిక్ మ్యాస్ట్రో దేవీ, మా ఫినామినల్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. సినిమా బ్లాక్ బస్టర్‌‌కు తక్కువ కాదు. దీనిని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని కామెంట్ పెట్టింది. కాగా ప్రస్తుతం ఈ మూవీలోని ‘మైండ్ బ్లాక్’ పాట చిత్రీకరణ జరుగుతుండగా.. దీంతో షూటింగ్ మొత్తం పూర్తి అవ్వనుంది.

కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన రష్మిక కనిపించనుండగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

https://www.instagram.com/p/B6GcbyOjvFp/