ఈసారి టార్గెట్ పవన్..?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎవ్వరూ కెలకానుకోరు. ఎందుకంటే అతడిని టార్గెట్ చేస్తే.. దానికి ఆయన నుంచి వచ్చే స్పందనను తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే రాజకీయాలు, సినిమాల్లో పేరున్న పెద్ద పెద్ద వాళ్లు సైతం వర్మకు దూరంగా ఉండాలనుకుంటారు. కానీ ఇవన్నీ తెలిసి వర్మతో పెట్టుకున్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. ఆయనను టార్గెట్ చేయడం వారికి ఇది మొదటిసారి కానప్పటికీ.. ఈసారి బతికున్న వర్మకు వారు పెద్ద కర్మ నిర్వహించారు. ‘జోహార్ […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎవ్వరూ కెలకానుకోరు. ఎందుకంటే అతడిని టార్గెట్ చేస్తే.. దానికి ఆయన నుంచి వచ్చే స్పందనను తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే రాజకీయాలు, సినిమాల్లో పేరున్న పెద్ద పెద్ద వాళ్లు సైతం వర్మకు దూరంగా ఉండాలనుకుంటారు. కానీ ఇవన్నీ తెలిసి వర్మతో పెట్టుకున్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. ఆయనను టార్గెట్ చేయడం వారికి ఇది మొదటిసారి కానప్పటికీ.. ఈసారి బతికున్న వర్మకు వారు పెద్ద కర్మ నిర్వహించారు. ‘జోహార్ ది బాస్టర్డ్’ అంటూ ఆయనపై ఉక్రోషాన్ని వెళ్లగట్టారు. ఇక దీనికి వర్మ కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అయితే పవన్ ఫ్యాన్స్ చేసిన చర్యను కాస్త సీరియస్‌గా తీసుకున్న వర్మ.. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేలా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో వర్మ నెక్ట్స్ పవన్‌ను టార్గెట్ చేస్తున్నారట.
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో పవన్‌ను పోలిన పాత్రను చూపించిన వర్మ.. ఈసారి ఆయనపై ఫుల్ లెంగ్త్ స్ఫూఫ్‌ను తీయాలని బలంగా అనుకుంటున్నాడట. దానికి తోడు ఇటీవల పవన్ ఫ్యాన్స్ వర్మపై చేసిన కామెంట్లు సైతం ఆ ఆలోచనకు మరింత బలం చేకూర్చారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీలో పవన్ పాత్ర చూపించినందుకే ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా.. ఇప్పుడు అతడిపై స్ఫూఫ్ తీస్తే వారు ఊరుకుంటారా..? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఇవన్నీ వర్మకు మామూలే కాబట్టి.. పవన్ సినిమాపై ఏ మాత్రం వెనుకడుగు వేసేందుకు ఆయన సిద్ధంగా లేరని సమాచారం. చూడాలి మరి నిజంగా పవన్‌పై వర్మ సినిమాను తీస్తాడా..? లేక మెగా ఫ్యామిలీలా దీన్ని పక్కన పెట్టేస్తాడా..? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.