మేడమ్ తుస్సాడ్స్‌లో ‘చందమామ’.. సౌత్‌లోనే మొదటి హీరోయిన్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్ తుస్సాడ్స్‌లో చందమామ మైనపు బొమ్మ కొలువుదీరబోతోంది. ఈ మేరకు ఆ మ్యూజియం ప్రతినిథులు కాజల్ కొలతలను తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కాజల్ మైనపు విగ్రహం ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. అదేంటంటే ఈ గౌరవం లభించిన తొలి సౌతిండియన్ హీరోయిన్ కాజల్ కావడం విశేషం. ఇక ఈ […]

మేడమ్ తుస్సాడ్స్‌లో 'చందమామ'.. సౌత్‌లోనే మొదటి హీరోయిన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 17, 2019 | 4:17 PM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్ తుస్సాడ్స్‌లో చందమామ మైనపు బొమ్మ కొలువుదీరబోతోంది. ఈ మేరకు ఆ మ్యూజియం ప్రతినిథులు కాజల్ కొలతలను తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కాజల్ మైనపు విగ్రహం ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. అదేంటంటే ఈ గౌరవం లభించిన తొలి సౌతిండియన్ హీరోయిన్ కాజల్ కావడం విశేషం. ఇక ఈ విషయంపై కాజల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. “చిన్నవయసులో మేడమ్ తుస్సాడ్స్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రముఖుల మైనపు బొమ్మలను చూసి ఎంతో ఇన్ఫైర్ అయ్యా. ఇప్పుడు వారి పక్కన నా బొమ్మ కూడా ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అని ట్వీట్ చేసింది. మరోవైపు కాజల్‌కు ఈ అరుదైన గౌరవం రావడంపై ఆమె అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు.

కాగా 2004లో హిందీ చిత్రం కౌన్ హో గయా నా అనే హిందీ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసిన కాజల్.. 2007లో లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌లో 50కి పైగా చిత్రాల్లో నటించింది. దాదాపుగా అందరూ స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఇక బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2, మంచు విష్ణు మోసగాళ్లు, బాలీవుడ్‌లో జాన్ అబ్రహాం నటిస్తోన్న ముంబయి సగలో కనిపించనుంది.

ఇదిలా ఉంటే బాలీవుడ్‌కు సంబంధించిన పలువురు నటీనటుల మైనపు బొమ్మలు ఇప్పటికే మేడమ్ తుస్సాడ్స్‌లో పలు బ్రాంచ్‌ల్లో ఉన్నాయి. ఆ లిస్ట్‌లో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్, మధుబాల, రాజ్ కపూర్, రణ్‌బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, శ్రీదేవీ, కరీనా కపూర్, అనుష్క శర్మ, వరుణ్ ధావన్, సోనూ నిగమ్, శ్రియా ఘోషల్, షాహిద్ కపూర్, దీపికా పదుకొనే తదితరులు ఉన్నారు. ఇక సౌత్ నుంచి ప్రభాస్(బాహుబలి), మహేష్ బాబులు కూడా ఇదివరకు ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకోగా.. ఇప్పుడు చందమామ వారి లిస్ట్‌లో చేరిపోయింది.