‘మామా అల్లుళ్ల’పై మహేష్ సూపర్ ట్వీట్..!
విక్టరీ వెంకటేష్ యాక్టీవ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఈయన ఎనర్జిటిక్‌గా ఉంటూ.. ఎదుటివారిలో ఉత్సాహం నింపుతారు. ఇక చైతూ సైలెంట్‌గా పంచ్‌లు విసురుతూంటాడు. కాగా.. వీరిద్దరూ కలిసి కాంబోగా రచ్చ చేసిన సినిమా ‘వెంకీ మామ’. 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇందులో మామగా వెంకీ అలరించగా.. చైతూ ఎంటర్‌టైన్ చేశాడు. వీరిద్దరి సరసన పాయల్, రాశీ ఖన్నా జోడీగా నటించారు. కాగా.. ఈ సినిమాకి కేఎస్ […]
విక్టరీ వెంకటేష్ యాక్టీవ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఈయన ఎనర్జిటిక్‌గా ఉంటూ.. ఎదుటివారిలో ఉత్సాహం నింపుతారు. ఇక చైతూ సైలెంట్‌గా పంచ్‌లు విసురుతూంటాడు. కాగా.. వీరిద్దరూ కలిసి కాంబోగా రచ్చ చేసిన సినిమా ‘వెంకీ మామ’. 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇందులో మామగా వెంకీ అలరించగా.. చైతూ ఎంటర్‌టైన్ చేశాడు. వీరిద్దరి సరసన పాయల్, రాశీ ఖన్నా జోడీగా నటించారు. కాగా.. ఈ సినిమాకి కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించగా డి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే.. ఈ చిత్రం చూసిన ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
‘వెంకీ మామ సినిమా ఫుల్ ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఈ సినిమాలో ప్రతీ బిట్‌ని నేను, నా ఫ్యామిలీ ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. వెంకటేష్ గారు, చైతూల మధ్య కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్‌కి ఓ వెలుగులా ఉంది. ఇందులో సెంటిమెంట్‌కి, ఎమోషన్స్‌కి, కామెడీకి ముఖ్యంగా ఫ్యామిలీకి ఇచ్చిన వ్యాల్యూస్ సూపర్‌గా ఉన్నాయి. ఈ మొత్తం చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు హీరో మహేష్ బాబు.
#VenkyMama is a thorough entertainer. Really enjoyed every bit of it. #Venkatesh garu and @chay_akkineni light up the screen with their Mama-Alludu chemistry ? A perfect blend of emotions, comedy and family values. Congratulations to the entire team ??
— Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2019