AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరు జారిన రోజా.. ‘చంద్రబాబుని మళ్లీ’ అనేసింది..!

అసెంబ్లీ సాక్షిగా నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి నోరు జారారు. ప్రస్తుతం ఆమె చంద్రబాబుపై చేసిన కామెంట్స్ ఫుల్‌గా ట్రోల్ అవుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబుని.. ‘ముఖ్యమంత్రి’ అని రోజా సంబోధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిసిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా.. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. మద్యపాన నిషేదంపై చర్చపై ఆమె మాట్లాడిన సందర్భంలో.. ఒక పక్క జగన్‌ని పొగుడుతూనే.. మరోపక్క చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మద్యపాన నిషేధం కోసం […]

నోరు జారిన రోజా.. 'చంద్రబాబుని మళ్లీ' అనేసింది..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 17, 2019 | 1:04 PM

Share

అసెంబ్లీ సాక్షిగా నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి నోరు జారారు. ప్రస్తుతం ఆమె చంద్రబాబుపై చేసిన కామెంట్స్ ఫుల్‌గా ట్రోల్ అవుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబుని.. ‘ముఖ్యమంత్రి’ అని రోజా సంబోధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిసిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా.. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. మద్యపాన నిషేదంపై చర్చపై ఆమె మాట్లాడిన సందర్భంలో.. ఒక పక్క జగన్‌ని పొగుడుతూనే.. మరోపక్క చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మద్యపాన నిషేధం కోసం ముఖ్యమంత్రి చేస్తోన్న ప్రయత్నాన్ని.. రాష్ట్రంలో ప్రతీ మహిళా అభినందిస్తోందని.. ఏ సీఎం చేయనటువంటి.. పేదరికాన్ని శాశ్వతంగా రూపు మాపేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును విమర్శిస్తూ.. మాజీ సీఎం చంద్రబాబు మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి మాట తప్పారని.. గత ప్రభుత్వ హయాంలో మద్యం ఏరులై పారిందని.. దీని వల్ల ఎంతో మంది మహిళలు రోడ్డున పడ్డారని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన సీఎంగా అయిన తర్వాత.. తొలి సంతకం బెల్ట్ షాపుల నిర్మూలనపై పెట్టారని.. కానీ అది అమలు చేయలేకపోయారని విమర్శించారు.

చంద్రబాబు, కరువు కవల పిల్లలని.. ఆయన ఎక్కడుంటే అక్కడ కరువు విలయ తాండవం చేస్తుందని ఆమె చతుర్లు విసిరారు. ‘గతంలో కృష్ణానదిలో వరద బదులు.. ‘మద్యం’ ఏరులై ప్రవహించిందని.. దీనిపై మాట్లాడటానికి ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి లేరని.. దీనిపై సమాధానం చెప్పలేరు కాబట్టే పారిపోయారని’ ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం సారీ.. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు గారు పారిపోయారని అన్నారు. దీంతో.. ఒక్కసారిగా అసెంబ్లీ సైలెంట్ అయిపోయింది. కాగా.. అసెంబ్లీ చివరిరోజు అయిన మంగళవారం ఆమె అసెంబ్లీకి హాజరు కాలేదు. ఈ వ్యాఖ్యలపై ఆమెకు అక్షింతలు పడినట్టు సమాచారం. ఏదైనా గతంలో ఒకసారి కూడా ఇలా వ్యాఖ్యలు చేసి ఆమె సస్పెండ్ అయ్యారు.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?