Nagarjuna: సోగ్గాడి సందడి కంటిన్యూ కానుందా..? నాగ్ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారుగా..
Soggade Chinni Nayana: నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం సొగ్గాడే చిన్నినాయనా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2016లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్..
Soggade Chinni Nayana: నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం సొగ్గాడే చిన్నినాయనా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2016లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయం అందుకోవడంతో దర్శకుడు సీక్వెల్‌ను తెరకెక్కించారు. ఈసారి బంగార్రాజు రూపంలో నాగార్జునతో పాటు నాగచైతన్యను కూడా రంగంలోకి దింపారు. చైతన్య సరసన కృతి శెట్టి నటించడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ దక్కింది. ఇక రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు వాయిదా పడడంతో సంక్రాంతి రేసులోకి అనుకోకుండా వచ్చిన బంగార్రాజు జవనవరి 14న ప్రేక్షలకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్ ఈవెంట్‌ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఈ సినిమా మూడో పార్ట్ గురించి హీరో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని మూడో పార్ట్ రానుందా.? అన్న ప్రశ్నకు నాగ్ స్పందిస్తూ.. అసలు సొగ్గాడే చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ముందుగా భావించలేదు, కానీ షూటింగ్ సమయంలో వచ్చిన ఆలోచనతో ‘బంగార్రాజు’ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు లేకపోలేవు అని చెప్పుకొచ్చారు. దీంతో బంగార్రాజుకు కూడా సీక్వెల్ రానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే సీక్వెల్ రానుందా.. లేదా అనేది బంగార్రాజు విడుదలైన తర్వాత దాని ఫలితంపై ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: Jio Recharge: యూజర్లకు జియో అదిరిపోయే అవకాశం.. ఇకపై రీఛార్జ్ చేసుకోవడం చాలా సులువు..
Viral Video: ఇదేం వింత.. కప్ప కడుపులో లైట్ వెలుగుతోంది.. షాకింగ్ వీడియో మీకోసం..