Viral Video: ఇదేం వింత.. కప్ప కడుపులో లైట్ వెలుగుతోంది.. షాకింగ్ వీడియో మీకోసం..

Viral Video: చిన్న పిల్లలు తమ చేతికి అందిన వస్తువులను తింటుండటం మనం చూస్తూనే ఉంటాం. అందుకని వారిని భయపెట్టేందుకు పెద్దలు కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు అంటుంటారు.

Viral Video: ఇదేం వింత.. కప్ప కడుపులో లైట్ వెలుగుతోంది.. షాకింగ్ వీడియో మీకోసం..
Follow us

|

Updated on: Jan 07, 2022 | 2:04 PM

Viral Video: చిన్న పిల్లలు తమ చేతికి అందిన వస్తువులను తింటుండటం మనం చూస్తూనే ఉంటాం. అందుకని వారిని భయపెట్టేందుకు పెద్దలు కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు అంటుంటారు. బియ్యం తింటే పెళ్లి సమయంలో వర్షం వస్తుందని, ఏవైనా కాయలు తింటే కడుపులో మొలకలు వస్తాయంటూ రకరకాల మాటలు చెబుతుంటారు. అదంతా ట్రాష్ అని అందరికీ తెలుసు. అది వేరే విషయం అనుకోండి. అయితే, ఇక్క మనం ఓ కప్ప గురించి చర్చించుకోబోతున్నాము. ఆ కప్ప మామూలు కప్ప కాదండోయ్.. దాని కడుపులో లైట్ చమక్ చమక్ అని మెరుస్తోంది. మరి ఆ కప్ప ఏందీ.. కడుపులో లైట్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం.

జంతువులకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కప్పకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇంట్లోని గోడను పట్టుకుని పాకుతున్న కప్ప కడుపులో లైట్ మిణుకు మిణుకుమంటోంది. ఇంతకీ దాని కడుపులోకి ఆ లైట్ వెళ్లిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణంగా కప్పలు చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తింటాయి. మినుగురు పరుగుల, చిన్న చిన్న పరుగులను గుటుక్కున మింగేస్తుంటాయి. అయితే, ఇంట్లోకి వచ్చిన ఓ కప్ప ఎదుట మిణకు మిణుకు మంటూ చిన్నసైట్ లైట్ మెరుస్తూ కనిపించింది. దానిని చూసి ఏదో జీవి అనుకున్న కప్ప.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గబాలున మింగేసింది. అది గమనించిన ఇంట్లోని వ్యక్తులు.. ఆ కప్పను కాసేపు పరిశీలించారు. కప్ప ఆ లైట్‌ను మింగినప్పటికీ.. అది పని చేస్తూనే ఉంది. కప్ప కడుపులోకి వెళ్లిన లైట్ వెలుగుతోంది. దీనిని వీడియో తీసిన ఇంట్లోని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించగా.. వేలాది లైక్స్ వచ్చాయి. ఇక కప్ప కడుపులో లైట్ వెలగడాన్ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కప్ప గ్రహాంతర జీవి అయ్యిండొచ్చని పేర్కొంటున్నారు.

Also read:

ICMR : ఒమిక్రాన్‌తో భయం లేదు.. లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స.. ఐసీఎంఆర్ నిపుణుల కీలక వ్యాఖ్యలు..

Swimming Without Hands: చేతుల్లేవ్‌.. కాళ్లకు తాడు కట్టుకుని ఈత.. ఇది నిజంగా ‘శివయ్య’ లీలే అనాలేమో..!

Corona – Osmania University: ఈనెల 8 నుంచి ఓయూ హాస్టల్స్ బంద్.. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అంటే..!