AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇటీవలే విడుదలైన నాగబంధం, రావు బహుదూర్ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు ఓటీటీలో రెండు సినిమాలు పోటీపడనున్నాయి. పెద్ది సినిమా త్వరలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అలాగే మరో క్రేజీ సినిమా కూడా విడుదల కానుంది.

OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 3:22 PM

Share

ప్రస్తుతం థియేటర్స్ లో నాగబంధం సినిమా, అలాగే సత్య దేవ్ నటించిన రావు బహుదూర్ సినిమాలు సందడి చేస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. రెండు సినిమాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో నాగబంధం సినిమా కాస్త తడబడింది.. కాగా సత్యదేవ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై మెప్పిస్తున్నాయి. త్వరలోనే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ పెద్ది కూడా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా పెద్ది స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా జూలై 09 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

పెద్ది సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం 35 రోజుల్లోనే (దాదాపు 5 వారాల థియేట్రికల్ విండో పూర్తి చేసుకొని) ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్ పైకి రావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు పెద్దికి పోటీగా మరో సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా మరేదో కాదు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన సింగ్ గీతం.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విభిన్నమైన  కథతో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాస రావు తీసిన ఈ మ్యూజికల్ వండర్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతుంది. జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పెద్దికి పోటీగా ఒకే రోజు ఒకే ఓటీటీలో సింగ్ గీతం సినిమా కూడా రానుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us