AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో నా పాటకు ప్రాణం పోశాడు.. తన నటనతో ఎవరెస్టు స్థాయికి పెంచాడు: సూద్దాల అశోక్ తేజ

తెలుగు సినిమా ప్రపంచంలో గేయ రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుద్ధాల అశోక్ తేజ. దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాటలతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. సినీ పాటల ప్రపంచంలో తన ప్రస్థానం అద్భుతంగా, అనూహ్యంగా సాగిందని, ప్రతిరోజూ కొత్త అనుభూతినిస్తుందని అన్నారు.

ఆ హీరో నా పాటకు ప్రాణం పోశాడు.. తన నటనతో ఎవరెస్టు స్థాయికి పెంచాడు: సూద్దాల అశోక్ తేజ
Suddala Ashok Teja
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 12:16 PM

Share

ఆర్ఆర్ఆర్ సినిమాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొమురం భీముడో పాట పుట్టుక, దాని సృజనాత్మక గురించి ప్రముఖ గేయ రచయిత సూద్దాల అశోక్ తేజ ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణిల సమక్షంలో జరిగిన చర్చల నుంచి ఈ గీతం ఎలా రూపుదిద్దుకుందో ఆయన వివరించారు. రాజమౌళిని రాఘవేంద్రరావు, దాసనారాయణరావుల కలయికగా అభివర్ణించిన అశోక్ తేజ, ఆయన మేధస్సు, సున్నిత హృదయం, అపారమైన గౌరవం గురించి ప్రస్తావించారు. కొమురం భీముడో పాట నేపథ్యాన్ని రాజమౌళి వివరించినప్పుడు, ఇంగ్లీష్ వారు కొడుతున్నా తలవంచని భీమ్ పాత్రను రాయమని కోరారట. ఈ సందర్భంలో, భీమ్ పాత్ర నుంచే నేరుగా పాటను రాయాలని సూద్దాల అశోక్ తేజ సూచించారు. “నేను వీరుడిని, లొంగను” వంటి పదాలు రాకుండా, “బలిదానం” అనే అంశాన్ని నొక్కి చెప్పి, మూడు విభిన్న రీతుల్లో పాటను రాశారట అశోక్ తేజ. ప్రస్తుతం ఉన్న పాట మూడో వెర్షన్ అని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

కొమురం భీముడో, కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో వంటి పదాల్లో విషాదం, ఆత్మవిశ్వాసం, ఆశయం పట్ల అంకితభావం పెనవేసుకుని ఉంటాయని అశోక్ తేజ వివరించారు. తెలంగాణ ప్రజల పలుకుబడులైన రగ రగ రాగా సూరీడై రగలాలి కొడుకో, భూతల్లి చనుబాలు తాగనట్టేరో వంటి పదబంధాలను ఉపయోగించి పాటను మరింత సహజంగా తీర్చిదిద్దారు. నిజాం వ్యతిరేక వీర తెలంగాణ పోరాటం, కొమురం భీముడు చేసిన త్యాగం (జల్, జమీన్, జంగల్) వంటి చారిత్రక అంశాలను పాటలో పొందుపరిచారు.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

రాజమౌళి ఇచ్చిన అపారమైన స్వేచ్ఛను అశోక్ తేజ గుర్తుచేసుకున్నారు. “ఎవరికీ అర్థం అవ్వదా, కోస్తా వాళ్ళకి అర్థం అవ్వదా, మద్రాస్ లో అర్థం అవ్వదా వదిలేయ్. నేను దృశ్యం ద్వారా అర్థం చేపిస్తా.. నువ్వు అక్కడ పుట్టి పెరిగిన కొమురం భీముడి వాయిస్ ఏదైతే ఉంటే అదే రాయ్” అని రాజమౌళి అన్నారని, ఇది రాజమౌళి గొప్పదనమని ప్రశంసించారు. చివర్లో రాజమౌళి కోరిన ఒక అదనపు పంక్తి కోసం, టీ తాగే లోపల పుడమి తల్లికి జనమ అరణ మిస్తివిరో కొమురం భీముడో అనే అద్భుతమైన లైన్‌ను రాసిచ్చారట. అరణము అనే తెలంగాణ సంప్రదాయ పదాన్ని ఇక్కడ ఉపయోగించిన విధానం పాట యొక్క లోతును పెంచింది. ఈ పాట విజయంలో జూనియర్ ఎన్టీఆర్ నటనను సూద్దాల అశోక్ తేజ ప్రత్యేకంగా కొనియాడారు. కట్టిపడేసిన స్థితిలో, సీనరీ మారకుండా కేవలం ముఖ కవళికలతోనే భావోద్వేగాలను పలికించి, పాటను ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. రాజమౌళి (ఉన్నత స్థాయికి), కీరవాణి (అద్భుత స్వర స్థాయికి), గాయకుడు  భైరవ (అద్భుత గళ స్థాయికి) కూడా ఈ పాట విజయానికి దోహదపడ్డారని, భైరవకు ఈ పాటకు జాతీయ అవార్డు కూడా వచ్చిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us