AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్‌లోకి వెళ్లాలన్నదే నా కోరిక.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా.. మరీ ఇంత పచ్చిగానా..!!

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 10వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కూడా త్వరలోనే ప్రారంభంకానుంది. బిగ్ బాస్ గేమ్ షోలో సెలబ్రెటీలు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు.

బిగ్ బాస్‌లోకి వెళ్లాలన్నదే నా కోరిక.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా.. మరీ ఇంత పచ్చిగానా..!!
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2026 | 12:09 PM

Share

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 10కు రెడీ అయ్యింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. సీజన్ 9 లానే ఈ సారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేయనున్నారు. సామాన్యులను హౌస్ లోకి పంపించి సెలబ్రెటీలతో పోటీకి దింపనున్నారు. దాంతో  ఇప్పుడు బిగ్ బాస్ 10 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 10కు కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే అగ్ని పరీక్ష 2 మొదలు కానుంది. దాంతో ఇప్పుడు చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇటీవలే అనౌన్స్ చేశారు. సామాన్యులకు ఆఫర్ అని చెప్పడంతో చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి చిత్రవిచిత్రమైన వీడియోలు చేస్తున్నారు. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో బాత్రూమ్స్ కడుగుతా అని కొంతమంది, హౌస్ లో వండిపెడతా అని మరికొంతమంది ఇలా చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అనుకుంటున్నా.. నేను కూడా యాక్టింగ్ చేస్తా, ఏడుస్తా అని తెలిపింది. అవసరమైతే ఎక్స్‌పోజింగ్ కూడా చేస్తాను.. నా గోల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం.. ఎన్నో మాటలు అన్నారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి చూపించాలి అనుకుంటున్నా అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పేరు దివ్య శ్రీ. ఈ అమ్మడు ఓ మోడల్.. మోడలింగ్ లో పలు అవార్డులు అందుకుంది. దివ్యశ్రీ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. నా ఓటు నీకే బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు.

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మోడల్ దివ్య శ్రీ కామెంట్స్ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!