AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్ చూస్తే షాకవుతారు!

జైలు అనగానే చీకటి గదులు, కఠినమైన శిక్షలు గుర్తొస్తాయి. కానీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఖైదీలు ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడిపే జైళ్లు ఉన్నాయి. ఆయా జైళ్లలో ఖైదీలకు ప్రైవేట్ రూములు, టీవీలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజిక్ స్టూడియోలు, రుచికరమైన వంటకాలతో పాటు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. శిక్షించడం కంటే నేరస్థుల్లో మానసిక మార్పు తీసుకువచ్చి, వారిని సమాజంలో మంచి వ్యక్తులుగా మార్చడమే ఈ విలాసవంతమైన జైళ్ల ముఖ్య ఉద్దేశం. అలాంటి జైల్లు ఎక్కడో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 06, 2026 | 1:30 PM

Share
సాధారణంగా జైలు అనగానే నాలుగు గోడల మధ్య చీకటి గదులు, చేతులకు బేడీలు, కఠినమైన పనులు, నాసిరకం ఆహారం గుర్తొస్తాయి. కానీ, ప్రపంచంలో కొన్ని దేశాల జైళ్లు ఫైవ్ స్టార్ రిసార్టులను తలపిస్తాయి. ఇక్కడి సౌకర్యాలు చూస్తే సామాన్యులకు సైతం అసూయ కలగక మానదు. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన జైళ్లు, వాటిలోని సదుపాయాల గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

1 / 5
బాస్టోయ్ జైలు, నార్వే : ఇదొక విచిత్రమైన ద్వీపకల్ప జైలు. ఇక్కడ ఖైదీలను గదుల్లో బంధించరు. వారు ఒక చిన్నపాటి గ్రామం లాంటి వాతావరణంలో కాటేజీలలో నివసిస్తారు. గుర్రపు స్వారీ, టెన్నిస్ ఆడటం, సముద్రంలో చేపలు పట్టడం, సన్‌బాత్ చేయడం వంటివి ఇక్కడి ఖైదీల రోజువారీ దినచర్యలు.

2 / 5
హాల్డెన్ జైలు, నార్వే : ప్రపంచంలోనే అత్యంత మానవీయమైన, లగ్జరీ జైలుగా దీనికి పేరుంది. ఇక్కడ ఖైదీలకు వ్యక్తిగత గదులు ఉంటాయి. వాటిలో అటాచ్డ్ బాత్‌రూమ్, ఫ్లాట్ స్క్రీన్ టీవీ, మినీ ఫ్రిజ్ ఉంటాయి. అంతేకాకుండా, ఖైదీలు తమ ఖాళీ సమయంలో ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, ట్రాక్‌లతో కూడిన రన్నింగ్ ఏరియా, ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

3 / 5
జస్టిజ్‌జెంట్రమ్ లీబెన్, ఆస్ట్రియా: బయట నుండి చూస్తే ఇదొక పెద్ద ఐటీ కంపెనీ లేదా మల్టీప్లెక్స్ మాల్ లాగా కనిపిస్తుంది. పూర్తిగా గాజు, స్టీల్‌తో నిర్మించిన ఈ జైలు లోపల ఖైదీలకు ప్రైవేట్ గదులు, స్పోర్ట్స్ కోర్టులు, కాన్ఫరెన్స్ హాలులు ఉన్నాయి. ఇక్కడి ఖైదీలు తమకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. నచ్చిన ఆహారాన్ని వారే స్వయంగా వండుకునే వీలుంది.

4 / 5
ఈ లగ్జరీ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?: ఖైదీలకు ఇన్ని ఐషారామ సౌకర్యాలు కల్పించడం వెనుక ఒక బలమైన సైన్స్, నసిక సిద్ధాంతం ఉంది. నార్వే వంటి స్కాండినేవియన్ దేశాలు పునరావాసం విధానాన్ని నమ్ముతాయి. నేరస్థులను హింసించడం వల్ల వారు మరింత క్రూరంగా మారతారని, అదే వారికి గౌరవప్రదమైన వాతావరణం కల్పిస్తే వారిలో పశ్చాత్తాపం కలిగి సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని ఈ దేశాల నమ్మకం. ఆశ్చర్యకరంగా, ఈ దేశాల్లో జైలు నుండి విడుదలయ్యాక మళ్లీ నేరాలు చేసే వారి శాతం ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉండటం విశేషం!

5 / 5
Follow Us
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!

శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?

ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!

ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?

నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..

లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!

నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు..

మోదీ 3 దేశాల టూర్.. ఇండో-పసిఫిక్‌పైనే ప్రత్యేక దృష్టి

నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!

లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే