మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలోని ఓ ఇంట్లో 40 నాగుపాము పిల్లలు ఒక్కసారిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఇంటి యజమాని రాజు కుటుంబం బెడ్ కింద గుట్టలుగా పడున్న పాము పిల్లలను చూసి భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్, అటవీ శాఖ సిబ్బంది వాటిని బయటకు తరలించినా, తల్లి పాము ఇంకా దొరకకపోవడంతో భయం వెంటాడుతోంది.