AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ కల్కి సినిమా ఆలయానికి మోక్షం.. పాత గుడి నమూనాలతో నిర్మాణానికి భూమి పూజ

పెన్నా నదీ ఒడ్డున వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని స్థానికులు చెప్పుకుంటారు. ఈ ఆలయం కరోనా సమయంలో 2020 సంవత్సరంలో ఆ గ్రామ యువకులు కొంతమంది కలిసి ఇసుక మేటలలో కూరుకుపోయిన ఈ ఆలయాన్ని గుర్తించి ఇసుకను తవ్వి వెలుగులోకి తీసుకోచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే..

ప్రభాస్ కల్కి సినిమా ఆలయానికి మోక్షం.. పాత గుడి నమూనాలతో నిర్మాణానికి భూమి పూజ
Kalki Movie Temple
Ch Murali
| Edited By: |

Updated on: Jul 06, 2026 | 12:35 PM

Share

పెన్నా నదీ ఒడ్డున వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని స్థానికులు చెప్పుకుంటారు. ఈ ఆలయం కరోనా సమయంలో 2020 సంవత్సరంలో ఆ గ్రామ యువకులు కొంతమంది కలిసి ఇసుక మేటలలో కూరుకుపోయిన ఈ ఆలయాన్ని గుర్తించి ఇసుకను తవ్వి వెలుగులోకి తీసుకోచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే.. మళ్ళీ ఆ తరువాత కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇసుక తిన్నెల లో కూరుకోపోయింది. ఇసుక మాఫియా జరిపిన తవ్వకాల్లో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా చాలా ఫెమస్ అయ్యింది. ఎంతో మంది ఈ ప్రాంతనికి వచ్చి ఇసుక తిన్నెలలో నుండి బయటకు వచ్చిన ఆలయాన్ని చూసి వెళ్లారు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా కూడా ఇక్కడ చిత్రించడంతో ఈ ఆలయం ఇంకా ప్రాముఖ్యత సంతరించుకున్నది.

ఆ ఆలయమే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళ పాడు గ్రామాంలో పెన్నా నదీ తీరానా ఉన్నది.. ఈ గుడిలో నాగేశ్వర స్వామి కొలువై ఉండేవాడని పూర్వకాలంలో పరశురాముడు ఈ గుడిలో పూజలు కూడా చేసేవాడని అక్కడ స్థానికులు చెప్పుకుంటారు.. ఆ తరువాత కాలక్రమంలో అక్కడ ఉండే గ్రామస్తులు పూజలు నిర్వహిస్తూ ఉండేవారు.. అనంతరం సుమారు వందల ఏళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా అక్కడ ఉన్న గ్రామంతో పాటు దేవాలయం కూడా ఇసుకలో పూడిపోయిందని స్థానికులు చెప్పుకునేవారు. అప్పటి నుండి ఆ ఆలయం అలాగే ఇసుకతో కప్పబడిపోయింది. అనంతరం గ్రామస్తులు మాత్రం ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఆ గ్రామాన్ని నిర్మించుకున్నారు. 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ నాగేశ్వరస్వామి ఆలయం గురించి అప్పటి పురావాస్తు శాఖ అలాగే దేవాదాయ శాఖ కొంచం హడావుడి చేసి వదిలేశారు. అనంతరం మళ్ళీ వచ్చిన వరదల కారణంగా మళ్ళీ ఇసుక మేటలతో కప్పబడిపోయి ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండిపోయింది. దీంతో గ్రామంలోని పెద్దలు యువకులు అందరూ కలిసి ఈ నాగేశ్వర స్వామి ఆలయం గురించి స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దేవదాయ శాఖ మంత్రి కావడంతో ఆయన దృష్టికి దేవాలయ అంశాన్ని తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి దేవాలయాన్ని పునర్నిర్మిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామస్తులకు ఇచ్చిన హామీ ఇచ్చారు.

ఎట్టకేలకుఇచ్చిన హామీ మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల సీజీఎఫ్ నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ప్రజా సౌకర్యార్థం రోడ్డుకు ఆనుకుని సుమారు ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో సనాతన సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నిబంధనలను అనుసరిస్తూ పురాతన ఆలయ నమూనాల అనుగుణంగా ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. ప్రధాన గర్భగుడి, ముఖ మండపం, ప్రాకార గోడలు, ధ్వజస్తంభం, యాగశాల, భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య వసతులు, ఉద్యానవనం వంటి అన్ని సౌకర్యాలతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ప్రాచీన శైవ క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం యువత ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడంతో గ్రామస్థుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us