Radhe Shyam : చాక్లెట్‌లో ఆవకాయ్ అడిగితే ఎలా బాసు..? రాధేశ్యామ్ సినిమా పై తమన్ కామెంట్స్

డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభాస్ ను స్క్రీన్ పైన చూసి అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు

Radhe Shyam : చాక్లెట్‌లో ఆవకాయ్ అడిగితే ఎలా బాసు..? రాధేశ్యామ్ సినిమా పై తమన్  కామెంట్స్
Radheshyam
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 14, 2022 | 3:01 PM

Radhe Shyam : డార్లింగ్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభాస్ ను స్క్రీన్ పైన చూసి అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై డార్లింగ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రియడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజహెగ్డే హీరొయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా పై మిక్స్డ్ టాక్ వస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను రాధేశ్యామ్ సినిమా అందుకోలేక పోయిందని టాక్ వినిపిస్తుంది. అయినా ఈ సినిమాకు బారీ ఓపెనింగ్స్ దక్కాయి. ప్రభాస్ అంటే ఆయన అభిమానులు యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను ఆశిస్తారు. కాని రాధేశ్యామ్ మూవీ కంప్లీట్ లవ్ స్టోరీ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు డైజిస్ట్ కాలేదు. దాంతో ఈ సినిమా పై డివైడ్ టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా కథ ప్రకారం సినిమాలో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు పెట్టలేదు. ఇదే విషయాన్నీ దర్శకుడు రాధాకృష్ణ ఇటీవల ఓ ఇంట్రవ్యూలో తెలిపారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.  ఈ సినిమాకు  తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కు యాక్షన్ హీరో అనే క్రేజ్ ఉంది.. అలాంటి ప్రభాస్ ప్యూర్ లవ్ స్టోరీ చేశారు అంటే గ్రేట్. మీరు చాక్లెట్ లో ఆవకాయ్ అడిగితే ఎలా?. ఇది చాక్లెట్ లాంటి స్వీట్ ఫిలిం.. సాహో సినిమాలో లవ్ స్టోరీ లేదు అంటున్నారు. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో ఫైట్స్ లేవు అంటున్నారు అంటూ తమన్ కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..