రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు మృతి.. అసలేం జరిగిందంటే..!
బుల్లితెర సీరియల్ నటుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు (32) బుల్లితెర నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుకు అయినవారు ఎవరు లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం..
బుల్లితెర సీరియల్ నటుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు (32) బుల్లితెర నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుకు అయినవారు ఎవరు లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడే స్థిరపడ్డారు. టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉండేవాడు. తన నటనతో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు బాలు.
ఈ క్రమంలో మే 18న స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్ నుంచి కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామానికి వెళ్లాడు. అనంతరం మర్నాడే అంటే మే 19న తిరిగి హైదరబాద్‌కు బైక్‌పై బయల్దేరాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత యాదాద్రి సమీపంలో బాలు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య ఉంది. బాలు మృతి పట్ల స్నేహితులు, తోటి నటీనటులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.