AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు కెరియర్‌ను మలుపు తిప్పిన ఆ సినిమాకు త్వరలో సీక్వెల్.. ఫ్యాన్స్ కు పండగే

మహేష్ బాబు కెరియర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు.  ఈ సినిమా ఇండస్ట్రీ హిట్  గా నివడమే కాకుండా మహేష్ బాబు కు స్టార్ డం తెచ్చిపెట్టింది.

మహేష్ బాబు కెరియర్‌ను మలుపు తిప్పిన ఆ సినిమాకు త్వరలో సీక్వెల్.. ఫ్యాన్స్ కు పండగే
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2020 | 10:04 PM

Share

మహేష్ బాబు కెరియర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు.  ఈ సినిమా ఇండస్ట్రీ హిట్  గా నివడమే కాకుండా మహేష్ బాబు కు స్టార్ డం తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఎంఎస్ రాజు.  సూపర్ హిట్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎంఎస్ రాజు కొంత విరామం తరువాత ఆయన దర్శకుడిగా మారి రూపొందించిన `డర్టీ హరి`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ఏటీటీలో విడుదలవుతోంది. ఈ మూవీ తనకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఎం.ఎస్. రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారు. మళ్లీ తన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ని ఘనంగా రీలాంచ్ చేయబోతున్నారట. ఈ క్రమంలోనే మహేష్‌తో ‘ఒక్కడు’ సీక్వెల్ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లుగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక ఒక్కడు సినిమాని తమిళంలో విజయ్, త్రిష జంటగా ‘గిల్లి’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా భారీ విజయాన్ని అందుకుంది. కన్నడలో ‘అజయ్ ‘గా, బెంగాలీలో ‘జోర్’ గా, హిందీలో ‘తేవర్’ గా రీమేక్ చేస్తే పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చింది. ఇక ‘డర్టీ హరి’ రిలీజ్ తర్వాత ‘ఒక్కడు’ సీక్వెల్‌పై ఫోక‌స్ పెట్ట‌బోతున్నాడట ఎంఎస్ రాజు. మరి మహేష్ ఈ సినిమా సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? ఇప్పటికే చాలా సినిమాలు మహేష్ కమిట్ అయి ఉన్నాడు. అటు దర్శకుడు గుణశేఖర్ కూడా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు . ఇక స్టార్ డైరెక్టర్స్ అంతా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కడు సినిమా స్టోరీకి సీక్వెల్ తీస్తారా ..? లేక మారిన ట్రెండ్ కు తగ్గట్టు మరో కథను సిద్ధం చేస్తారా .? అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి..

Follow Us
ఉగాది పచ్చడిలో వేప పువ్వు.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గని..అమేజింగ్
ఉగాది పచ్చడిలో వేప పువ్వు.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గని..అమేజింగ్
ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!
ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!
కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ ఫీజు రూల్స్
కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ ఫీజు రూల్స్
ఐపీఎల్ 19వ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఏడుగురు
ఐపీఎల్ 19వ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఏడుగురు
అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ..నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు
అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ..నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు
వీరికి బీట్‌రూట్ విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తాగితే..
వీరికి బీట్‌రూట్ విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తాగితే..
తోటకూర, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే ప్లేట్స్ మొత్తం ఊడ్చేస్తారు
తోటకూర, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే ప్లేట్స్ మొత్తం ఊడ్చేస్తారు
షుగర్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా? రక్తంలో చక్కెర పెరగొద్దు అంటే!
షుగర్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా? రక్తంలో చక్కెర పెరగొద్దు అంటే!
ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెట్టితే డబ్బుల వర్షం
ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెట్టితే డబ్బుల వర్షం
వంటింట్లోని ఈ ఒక్క పదార్థంతో ఆ సమస్యలన్నీ మాయం..
వంటింట్లోని ఈ ఒక్క పదార్థంతో ఆ సమస్యలన్నీ మాయం..