Tamannaah: పింపుల్స్ నివారణకు స్టార్ హీరోయిన్ చెప్పిన వైరల్ టిప్… మరెందుకు లేట్ ట్రై చేసేయండి
నటీనటుల యాక్టింగ్‌కే కాదు వారి స్కిన్‌కేర్, ఫిట్నెస్కీ ఫ్యాన్స్ ఉంటారు. మెరిసిపోయే స్కిన్కోసం ఎలాంటి క్రీమ్‌లు, రెమిడీలు వాడుతారో తెలుసుకోవాలని ఉత్సాహపడతారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చెప్పిన స్కిన్‌కేర్ టిప్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ హ్యాక్ వినగానే నెటిజన్లు ..

నటీనటుల యాక్టింగ్‌కే కాదు వారి స్కిన్‌కేర్, ఫిట్నెస్కీ ఫ్యాన్స్ ఉంటారు. మెరిసిపోయే స్కిన్కోసం ఎలాంటి క్రీమ్‌లు, రెమిడీలు వాడుతారో తెలుసుకోవాలని ఉత్సాహపడతారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చెప్పిన స్కిన్‌కేర్ టిప్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ హ్యాక్ వినగానే నెటిజన్లు ‘ఇదేం టిప్?’ అని నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఈ రెమెడీకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఎన్నో కాస్మెటిక్ క్రీమ్స్, ట్రీట్‌మెంట్స్ ట్రై చేసినా పింపుల్స్ తగ్గని వాళ్లను ఈ రెమిడీ ట్రై చేయమని ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
తాజాగా ఒక పాపులర్ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ తన పర్సనల్ స్కిన్ సీక్రెట్ బయటపెట్టింది. పింపుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారని అడగ్గానే నవ్వుతూ, ‘పొద్దున్న లేవగానే నోట్లోని ఉమ్ము తీసి మొటిమల మీద రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మనం పడుకున్నప్పుడు మన శరీరం బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. ముఖం, కళ్లు, నోట్లో యాంటీ బాక్టీరియల్ మ్యూకస్ చేరుతుంది. దాన్ని తీసి మొటిమలపై రాస్తే చక్కగా పనిచేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తమన్నా పంచుకున్న ఈ స్కిన్‌కేర్ టిప్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
2021 నుంచి మొటిమల నివారణకు తను ఈ హ్యాక్‌ను ఫాలో అవుతున్నానని, రాత్రంతా మొహం బ్యాక్టీరియాతో పోరాడుతుంది కాబట్టి మార్నింగ్ సాలివాలో యాంటీ-బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయని వివరించింది. ఇది పింపుల్‌ను త్వరగా డ్రై చేసి ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు, 24–25 ఏళ్ల నుంచే యాంటీ-ఏజింగ్ క్రీమ్స్ ఉపయోగిస్తున్నానని, గ్లూటెన్-డైరీ అలర్జీలు గుర్తించి డైట్ మార్చుకుని గ్లోయింగ్ స్కిన్ సాధించానంది తమన్నా.
అయితే కొందరు డెర్మటాలజిస్టులు సలైవాలో లైసోజైమ్, ఇమ్యూనోగ్లోబులిన్ లాంటి యాంటీ-బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయని అంగీకరిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం, ‘ఇది పర్సనల్ హ్యాక్ మాత్రమే, అందరికీ వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు. బ్యాక్టీరియా రిస్క్ ఉంది’ అని హెచ్చరిస్తున్నారు. సేఫ్ సైడ్ ఉండాలంటే సాలిసైలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ వాడమని సూచిస్తున్నారు. మరి మీరు తమన్నా హ్యాక్ ట్రై చేస్తారా?




