నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై.. మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై బాలకృష్ణ నోరు జారొద్దు. మీటింగ్‌కు ఎవరిని పిలవాలో కమిటీకి తెలుసు. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బాలయ్య నోరు అదుపులో...

  • Tv9 Telugu
  • Publish Date - 6:41 pm, Thu, 28 May 20
నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సీనియర్ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై.. మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై బాలకృష్ణ నోరు జారొద్దు. మీటింగ్‌కు ఎవరిని పిలవాలో కమిటీకి తెలుసు. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బాలయ్య నోరు అదుపులో ఉంచుకోవాలి. బాలయ్య ఒకటంటే.. మేం రెండు మాటలనేందుకు రెడీగా ఉన్నాం. ప్రభుత్వానికీ, సినీ ఇండస్ట్రీకి బాలయ్య క్షమాపణలు చెప్పాలి. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు అంటూ బాలయ్యపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాక్‌ డౌన్‌ విషయంలో ఇండస్ట్రీలో వేలమంది కార్మికులు ఇబ్బంది పడుతుంటే అందరూ సాయం చేశారు. పెద్దా చిన్నా అందరూ పేద కార్మికుల కోసం పనిచేశారు. షూటింగులు ఎలా ప్రారంభించాలనే విషయంపై తలసాని ఆధ్వర్యంలో చిరంజీవి ఇంట్లో నాగార్జున, త్రివిక్రమ్‌, రాజమౌళి, అరవింద్‌, సురేష్‌బాబు, సి.కల్యాణ్‌లాంటి ప్రముఖులు పాల్గొని చర్చించారు. ఇలా లిమిటెడ్‌ గ్యాదరింగ్‌తో ఈ సమావేశం జరిగింది.

తలసానిగారు చిరంజీవి ఇంటికి వచ్చి మాట్లాడుదామన్నారా…? అసలేం జరిగిందో నాకు తెలియదు. బాలకృష్ణను మీటింగ్‌కి పిలవకపోవడం రైటా? రాంగా? నాకు తెలియదు. అసలు మీటింగ్‌కి బాలకృష్ణను పిలిచారా? పిలవలేదా? అనేది మీటింగ్‌ని ఏర్పాటు చేసిన వాళ్లని అడగాల్సిన బాధ్యత బాలకృష్ణదని కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

ఇది కూడా చదవండి:

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

మహిళలకు కేంద్రం బంపర్ ఆఫర్.. నెలకు రూ.4 వేల జీతం పక్కా!

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు