AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత, పూజా ఫ్యాన్స్ వార్.. నెట్టింట రచ్చ రచ్చ..!

సమంత, పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ట్విట్టర్‌లో వార్‌ జరుగుతోంది. తమ అభిమాన నటికి పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సమంత ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

సమంత, పూజా ఫ్యాన్స్ వార్.. నెట్టింట రచ్చ రచ్చ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2020 | 3:13 PM

Share

సమంత, పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ట్విట్టర్‌లో వార్‌ జరుగుతోంది. తమ అభిమాన నటికి పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సమంత ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు PoojaMustApologizeSamantha అనే హ్యాష్‌ట్యాగ్‌తో వారు ట్వీట్లు పెడుతున్నారు. అయితే మరోవైపు WeSupportPoojaHegde హ్యాష్‌ట్యాగ్‌తో పూజా ఫ్యాన్స్‌ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ కాస్త ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతోంది. అయితే సమంతకు, పూజా హెగ్డేకు మధ్య ఏం జరిగింది..? సమంతను బుట్ట బొమ్మ ఏమంది..? ఫ్యాన్స్‌ ఎందుకు ఫైర్ అవుతున్నారు అంటే..!

ఇటీవల పూజా హెగ్డే ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఓ పోస్ట్‌ వచ్చింది. అందులో ‘మజిలీ’ సినిమాలో సమంతకు సంబంధించిన ఓ స్టిల్ ఉండగా.. దానికి ‘ఆమె నాకు పెద్ద అందంగా కనిపించలేదు’ అన్న కామెంట్ ఉంది. దీంతో సమంత ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. పూజా హెగ్డేపై దాడికి దిగారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పూజా హెగ్డే తన అకౌంట్ హ్యాక్‌ అయినట్లు గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ”తన ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌ అయ్యిందని, తన టీమ్ కష్టపడి మళ్లీ సరిచేశారని” చెప్పారు. అయినా ఆ సమాధానం సమంత అభిమానుల కోపాన్ని చల్లార్చలేదు. పూజా, సమంతకు సారీ చెప్పాల్సిందేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అటు పూజా ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు.  WeSupportPoojaHegde అనే హ్యాష్‌ట్యాగ్‌తో బుట్ట బొమ్మకు మద్దతును తెలుపుతున్నారు.  ఈ క్రమంలో వీరిరువురి ఫ్యాన్స్ మధ్య వార్ ప్రస్తుతం నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.

Read This Story Also: జిల్లా ఎస్పీగా మారిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి జూనియర్ విన్నర్..!

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం