AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఆ కంటెస్టెంట్‌ను గుడ్డిగా నమ్మా.. కానీ నాకే వెన్నుపోటు పొడిచారు.. ఎలిమినేషన్‌పై ఝాన్సీ

Bigg Boss Telugu 10: ఆ కంటెస్టెంట్‌ను గుడ్డిగా నమ్మా.. కానీ నాకే వెన్నుపోటు పొడిచారు.. షాకింగ్ విషయం చెప్పిన ఝాన్సీ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటి కామనర్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది ఫోక్ సింగర్ ఝాన్సీ. తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఆమె ఆట తీరు చూసి గ్రాండ్ ఫినాలే వరకు వెళుతుందనుకున్నారు. కానీ..

Bigg Boss Telugu 10: ఆ కంటెస్టెంట్‌ను గుడ్డిగా నమ్మా.. కానీ నాకే వెన్నుపోటు పొడిచారు.. ఎలిమినేషన్‌పై ఝాన్సీ
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Nov 03, 2026 | 7:49 PM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ వారం డబుల్ ఎలిమినేషన్ విషయంలో రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. సింగర్‌ ఝాన్సీ, రోహిత్‌ ఇద్దరూ గత వీకెండ్ లో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. ఆడియెన్స్ ఓట్ల ద్వారా సింగర్‌ ఝాన్సీని, కంటెస్టెంట్ల ఓట్ల ద్వారా రోహిత్‌ని ఇంటి నుంచి పంపించారు బిగ్ బాస్. రోహిత్ సంగతేమో కానీ భారీ ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఝాన్సీ.. అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యే సరికి తట్టుకోలేకపోయింది. బిగ్ బాస్ హౌస్ లోనే కన్నీళ్లు పెట్టుకుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 లో పాల్గొని సత్తా చాటింది సింగర్ ఝాన్సీ. ఆ తర్వాత మెయిన్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. తన దైన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సేఫ్ గేమ్ ఆడుతుందని విమర్శలు వచ్చినా తన మాట తీరు, టాస్కుల్లో ఎఫర్ట్, హౌస్‌లో తన అభిప్రాయాలను చెప్పే విధానం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఝాన్సీ ఆట తీరు చూసి ఆమె కచ్చితంగా గ్రాండ్ ఫినాలే వరకు వస్తుందనకున్నారు చాలా మంది. అయితే అనూహ్యంగా ఎనిమిదో వారంలోనే ఆమె ఎలిమినేట్ బయటకు వచ్చేసింది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది ఝాన్సీ. ఈ నేపథ్యంలో తన బిగ్ బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది.

‘నేను ఇంత తొందరగా బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. ఇది నాకే పెద్ద షాకింగ్‌గా ఉంది. గేమ్స్, టాస్క్ లో నేను బాగానే ఆడాను. ఎక్కడా తగ్గలేదు. కచ్చితంగా టాప్‌ 5 లో ఉంటానని భావించాను. కానీ సడెన్ గా ఎలిమినేషన్‌ అనేసరికి నమ్మలేకపోతున్నాను’ అని చెప్పుకొచ్చింది ఝాన్సీ. కాగా ఓ ఇంటర్వ్యూలో దేబ్జానీపై షాకింగ్ కామెంట్స్ చేసిందీ ఫోక్ సింగర్. ‘దేబ్ జానీని నేను గుడ్డిగా నమ్మాను. సొంత అక్కలా భావించాను. అయితే తర్వాత ఆమె నాతో యాక్టింగ్ చేస్తోందని అర్థమైంది. నాతో ప్రేమగా ఉండడంతో ఆమె నన్ను మోసం చేయదనుకున్నాను. కానీ చివరకు నాకే వెన్నుపోటు పొడిచింది. అందుకే ఆమెకు దూరంగా ఉండాలనుకున్నాను. చివరి వారంలో జరిగిన కొన్ని టాస్కుల సమయంలో కూడా నాకు సపోర్ట్ చేయొద్దని ఇతర కంటెస్టెంట్లకు చెప్పింది ఝాన్సీ. ఇది నాకెంతో బాధ కలిగించింది’ అని వాపోయింది ఝాన్సీ.

ఇక బిగ్ బాస్ 10 విన్నర్‌ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందని అడగ్గా త్రిగుణ్‌కి ఛాన్స్ ఉందని చెప్పింది ఝాన్సీ. అలాగే ముఖేష్‌ అన్న కూడా విన్నర్‌ కావాలని కోరుకుంటానని చెప్పింది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us