జిల్లా ఎస్పీగా మారిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి జూనియర్ విన్నర్..!

చదువుతో పాటు అదృష్టం కలిసొస్తే అనుకొన్నది సాధ్యమవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ. చిన్నతనం నుంచే విద్యాపాటవాలు ప్రదర్శించి ఓ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణస్తున్నాడు. 2001లో ప్రసారమైన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్‌ సైనికి అప్పుడు 14 ఏండ్లు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కేబీసీ జూనియర్‌లో పాల్గొని 15 ప్రశ్నలకు […]

జిల్లా ఎస్పీగా మారిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి జూనియర్ విన్నర్..!
Follow us

|

Updated on: May 28, 2020 | 9:27 PM

చదువుతో పాటు అదృష్టం కలిసొస్తే అనుకొన్నది సాధ్యమవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ. చిన్నతనం నుంచే విద్యాపాటవాలు ప్రదర్శించి ఓ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణస్తున్నాడు. 2001లో ప్రసారమైన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్‌ సైనికి అప్పుడు 14 ఏండ్లు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కేబీసీ జూనియర్‌లో పాల్గొని 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కరోడ్‌పతిగా నిలిచాడు. అనంతరం జైపూర్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసి అక్కడే ఎంబీబీఎస్‌ కూడా పూర్తి చేశాడు. నేవీలో పనిచేస్తున్న తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో 2014లో సివిల్స్‌ రాసి 461 ర్యాంకు సాధించిన రవిమోహన్‌ సైని.. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోర్‌బందర్‌ ఎస్సీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేయడంలో దృష్టిసారించామని, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తానని సైనీ చెప్పారు. 14 ఏండ్ల ప్రాయంలో అమితాబ్‌ బచ్చన్‌ సార్‌తో కలువడం, కోటి రూపాయలు గెలువడం జీవితంలో మరిచిపోలేని అనుభూతులని అన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..