AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతుందని టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారట. గతంలో కూడా కళ్యాణ్ రామ్.. 'మనం' చిత్రం చూసిన తర్వాత తమకి కూడా అలాంటి ఫిల్మ్ చేస్తే బావుండు...

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 28, 2020 | 6:31 PM

Share

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు, కుర్ర హీరోలు అనే బేధం లేకుండా సిల్వర్ స్క్రీన్‌లో కనిపించడానికి స్టార్‌డమ్ పక్కనపెట్టేస్తున్నారు. అలాగే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఫేమస్ ఫ్యామిలీల నుంచి మల్టీ స్టారర్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిటీ, మంచు ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఇలా అన్ని రకాల కుటుంబాల నుంచి సినిమాలు వచ్చాయి. కానీ.. ఇంతవరకూ నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి చిత్రాలు రాలేదు. కనీసం గెస్ట్ రోల్‌లో కూడా వీరు కనిపించిన జాడ లేదు.

అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతుందని టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారట. గతంలో కూడా కళ్యాణ్ రామ్.. ‘మనం’ చిత్రం చూసిన తర్వాత తమకి కూడా అలాంటి ఫిల్మ్ చేస్తే బావుండు అనిపించిందని, చాలా సార్లు ఈ విషయంపై నేనూ తారక్ చర్చించుకున్నామని చెప్పారు.

అయితే ప్రొడ్యూసర్‌గా అనుభవమున్న కళ్యాణ్ రామ్.. తన ఫ్యామిలీ మెంబర్స్‌తోనే కలిసి ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఎక్స్‌పీరియన్స్ రైటర్స్‌తో కథలకు సంబంధించి చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే మరి ఇది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ.. నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ వస్తే కనుక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొంటాయని అభిమానులు అంటున్నారు.

ఇది కూడా చదవండి:

మహిళలకు కేంద్రం బంపర్ ఆఫర్.. నెలకు రూ.4 వేల జీతం పక్కా!

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

Follow Us
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం శుభవార్త
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం శుభవార్త
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
క్యాప్సికంను నిర్లక్ష్యం చేయొద్దు… ఆరోగ్యానికి ఇది బంగారం!
క్యాప్సికంను నిర్లక్ష్యం చేయొద్దు… ఆరోగ్యానికి ఇది బంగారం!
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది