ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర వార్త..!

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను తీయబోతున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ..

ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర వార్త..!

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను తీయబోతున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌, ఈ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు వివరించారు. అయితే ఇక కథకు సంబంధించిన చర్చలు జరగలేదని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే తాజా టాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల ఎన్టీఆర్‌కి ప్రశాంత్ ఓ పీరియాడిక్‌ కథను చెప్పారట. ఆ కథను విన్న ఎన్టీఆర్‌ చాలా ఎగ్జైట్ అయ్యారట. అంతేకాదు ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేయాలని ప్రశాంత్‌కి సూచించారట ఎన్టీఆర్‌. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ 2 పనుల్లో ఉన్న ప్రశాంత్.. ఆ ప్రాజెక్ట్ తరువాత ఎన్టీఆర్‌ మూవీ స్క్రిప్ట్‌పై పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలన్న ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం.

కాగా ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. మరోవైపు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2ను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న టాక్ నడిచినప్పటికీ.. థియేటర్లకు అనుమతిని ఇస్తే అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వస్తామని మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

Read This Story Also: పాక్‌ విమాన శిధిలాల్లో దొరికిన రూ.1.4కోట్ల నగదు..!

Click on your DTH Provider to Add TV9 Telugu