లాక్‌డౌన్ తర్వాత… టాలీవుడ్‌లో తొలి అడుగు ఇదే

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినిమా పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. అయితే లాక్‌డౌన్ 4.0లో ఆక్షలు ఎత్తివేటంతో డబ్బింగ్ వంటి పనులు మొదలయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో డబ్బింగ్ స్టూడియో ఓపెనైంది. ఇందులో తొలి డబ్బింగ్‌ను నవీన్‌ పోలిశెట్టి లీడ్‌రోల్ చేస్తున్న జాతిరత్నాలు మూవీకి డబ్బింగ్ చెప్పారు సీనియర్ నటుడు నరేశ్. మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడిగా ఇదో గొప్ప అనుభూతి అన్నారు నరేష్. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకెళదాం.. […]

లాక్‌డౌన్ తర్వాత... టాలీవుడ్‌లో తొలి అడుగు ఇదే

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినిమా పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. అయితే లాక్‌డౌన్ 4.0లో ఆక్షలు ఎత్తివేటంతో డబ్బింగ్ వంటి పనులు మొదలయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో డబ్బింగ్ స్టూడియో ఓపెనైంది. ఇందులో తొలి డబ్బింగ్‌ను నవీన్‌ పోలిశెట్టి లీడ్‌రోల్ చేస్తున్న జాతిరత్నాలు మూవీకి డబ్బింగ్ చెప్పారు సీనియర్ నటుడు నరేశ్. మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడిగా ఇదో గొప్ప అనుభూతి అన్నారు నరేష్. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకెళదాం.. జాగ్రత్తలు తీసుకుందాం.. సినిమా ఇండస్ట్రీని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు నరేష్. సర్కారిచ్చిన పర్మిషన్‌తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇక జోరందుకోనున్నాయి.