ఓటీటీలో విడుద‌ల‌కు ముందే పైరసీ..!

ప్రముఖ నటి జ్యోతిక నటించిన తమిళ మూవీ ‘పొన్​మగళ్ వందల్’, ఓటీటీలో నేడు విడుదలైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు మంచి రివ్యూస్ వ‌స్తున్నాయి. అయితే ఈ రిలీజ్ కు కొన్ని గంటల క్రితమే ఓ పైరసీ సైట్​లో ఫుల్ మూవీ దర్శనమిచ్చింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందుగానే  అమెజాన్ ప్రైమ్​లో మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రొడ్యూస‌ర్స్. ముందుగా అనుకున్న షెడ్యూల్​ ప్రకారం మే 29న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమయ్యారు. అంతకముందు […]

ఓటీటీలో విడుద‌ల‌కు ముందే పైరసీ..!

ప్రముఖ నటి జ్యోతిక నటించిన తమిళ మూవీ ‘పొన్​మగళ్ వందల్’, ఓటీటీలో నేడు విడుదలైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు మంచి రివ్యూస్ వ‌స్తున్నాయి. అయితే ఈ రిలీజ్ కు కొన్ని గంటల క్రితమే ఓ పైరసీ సైట్​లో ఫుల్ మూవీ దర్శనమిచ్చింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందుగానే  అమెజాన్ ప్రైమ్​లో మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రొడ్యూస‌ర్స్.

ముందుగా అనుకున్న షెడ్యూల్​ ప్రకారం మే 29న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమయ్యారు. అంతకముందు రోజు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖుల‌ కోసం ప్రైమ్ వేదికగా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే హెచ్​డీ ప్రింట్​ను కొందరు దుండ‌గులు తస్కరించినట్లు స‌మాచారం. అయితే ఈ మూవీ చూసిన సెలబ్రిటీలు అందరూ చిత్ర‌ యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రొడ్యూస‌ర్ సూర్య, నటి జ్యోతికల‌ను క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. ఇందులో జ్యోతికతో పాటు కె.భాగ్యరాజా, పార్తిబన్, పాండిరాజన్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. మొద‌ట ఈ చిత్రాన్ని మార్చి 27న థియేటర్లలోకి తీసుకురావాలని భావించినా, క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ కారణంగా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ​ఈ క్ర‌మంలో సూర్య దంప‌తులపై ప‌లు థియేట‌ర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.