Sumitra Bhave: చిత్రపరిశ్రమలో మరో విషాదం… లెజండరీ డైరెక్టర్ సుమిత్ర భావే మృతి..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మరాఠీ చిత్ర దర్శకురాలు, జాతీయ చలనచిత్ర అవార్డుల విజేత సుమిత్రా భావే (78) తుది శ్యాస విడిచింది.

Sumitra Bhave: చిత్రపరిశ్రమలో మరో విషాదం... లెజండరీ డైరెక్టర్ సుమిత్ర భావే మృతి..
Sumitra Bhave
Follow us

|

Updated on: Apr 19, 2021 | 2:01 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మరాఠీ చిత్ర దర్శకురాలు, జాతీయ చలనచిత్ర అవార్డుల విజేత సుమిత్రా భావే (78) తుది శ్యాస విడిచింది. ఉపరితిత్తుల ఇన్ఫెక్షన్‏తో భాదపడతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున పూణెలోని పూణెలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కొద్దిరోజులుగా ఆమె ఉపరితిత్తులు ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది. గత 10 రోజుల క్రితమే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. జనవరి వరకు ఆమె మోహన్ అగాషేతో కలిసి ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారని సూనీల్ సక్తాంకర్ తెలిపారు.

Sumitra Bhave 1

Sumitra Bhave

సునీల్‌ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త దారిలో నడిపించింది. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, నాలుగు టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. వీటన్నింటికీ సుమిత్ర భవే రచయితగా పని చేసింది. సునీల్‌ సుక్తాంకర్‌ నటుడిగా, పాటల రచయితగానూ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా.. సుమిత్ర సినిమాలకు 90 కి పైగా సునీల్ స్వయంగా పాటలను రాసాడు. 2016లో వారు తీసిన కాసవ్‌ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ లోటస్‌ నేషనల్‌ అవార్డు వచ్చింది. సుమిత్ర భావే దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు దహవి ఫా, దేవ్రాయ్, వాస్తుపురుష్, అస్తు కసవ్ సినిమాలు ప్రశంసలు అందుకున్నాయి. 50 వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో వాస్తుపురుష్‌కు మరాఠీలో ఉత్తమ చలన చిత్రంగా అవార్డు లభించగా, ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల జీవితం, గూడు చక్రానికి సంబంధించి యువతలో నిరాశ సమస్యను చిత్రీకరించిన కసావ్ 64 వ స్థానంలో ఉత్తమ చలన చిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. దర్శకురాలిగానే కాకుండా.. సుమిత్ర నిర్మాతగానూ కొన్ని చిత్రాలను తెరకెక్కించింది.

భావే జనవరి 12, 1943 న పూణేలో జన్మించింది. ఫెర్గూసన్ కాలేజీ నుండి పట్టా పొందిన తరువాత, ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నుంచి గ్రామీణాభివృద్ధిలో మరో డిగ్రీ పొందారు. ఆమె విద్యను పూర్తి చేసిన తరువాత, భావే అనేక సామాజిక సంస్థలతో ఉచితంగా పనిచేశారని చిత్ర పరిశ్రమలోని ఆమె సహచరులు తెలిపారు. పూర్తి సమయం సామాజిక శాస్త్రవేత్తగా ఉనన ఆమె అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ వైపు అడుగులు వేసారని.. క్రమంగా పూర్తిగా సినీ ఇండస్ట్రీలోకి మారారు. సుమిత్ర మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Keerthi Suresh: జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా కీర్తిసురేష్.. చీరకట్టులో ‘మహానటి’ బ్యూటీఫుల్ పిక్స్..