Sameera Reddy: నాతో పాటు నా పిల్లలకు కూడా కరోనా బారిన పడ్డారు.. జాగ్రత్తగా ఉండమంటూ ఎమోషనల్ పోస్ట్
Sameera Reddy:దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్.. ఒక రేంజ్ లో విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ కోవిడ్ బారిన పడుతున్నారు..
Sameera Reddy:దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్.. ఒక రేంజ్ లో విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ కోవిడ్ బారిన పడుతున్నారు.. కరోనా విజృంభణ ఇప్పటిలో ఆగేలా లేదు అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక సినీ నటీనటులు ఈ కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అచ్చ తెలుగమ్మాయి.. బాలీవుడ్ నటి సమీరా రెడ్డి తనతో పాటు.. తన పిల్లలకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పెట్టింది.
తనకు ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని…. ప్రస్తుతానికి తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది సమీరా రెడ్డి. ఇక తన ముఖంపై చిరునవ్వుని తీసుకొచ్చేవారు ఎందరో ఉన్నారని.. ఇటువంటి సమయంలోనే మంచి ఆలోచనలు. భవిష్యత్ పై ఆశ పాజిటివ్ దృక్పధం ఉండాలని పోస్ట్ చేసింది. అయితే
తనకు కరోనా టెస్టులను నాలుగు రోజుల క్రితం చేయగా పాజిటివ్ గా తేలిందని.. ఇప్పుడు పిల్లలకు కూడా కొవిడ్ పాజిటివ్ గా తేలిందని .. ఎవరూ కరోనాను నిర్లక్ష్యం చేయకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమీరా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హిందీ, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమీరా రెడ్డి 2014 లో ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ్ వార్టెను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తెలుగులో జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో జోడీ కట్టగా.. జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ సినిమాల్లో నటించింది. తమ అభిమాన హీరోయిన్ సమీరా రెడ్డి తో పాటు.. ఆమె పిల్లలు కూడా కొరోనా బడిన పడడంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
View this post on Instagram
Also Read: ఏపీలో రాగాల మూడు రోజులకు వాతావరణ సూచన.. అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం