సినీనటిపై దర్శకుని దాష్టీకం.. రంగంలోకి పోలీసులు

ప్రముఖ మలయాళ దర్శకుడు వి.ఏ శ్రీకుమార్ మీనన్‌పై నటి మంజు వారియర్ పోలీసు కేసు నమోదు చేసింది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు క్యాంపెయినింగ్ చేస్తూ.. తన పరువును తీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన స్నేహితులను బెదిరిస్తున్నారని… అయన నుంచి తనకు ప్రాణహాని ఉందని మంజు వారియర్ కేరళ డీజీపీ లోకనాథ్ బెహెరా‌కు తెలిపారు. ‘మంజు వారియర్ ఫౌండేషన్’ లెటర్ పాడ్స్, బ్లాంక్ చెక్స్‌ను దర్శకుడు శ్రీకుమార్ మీనన్ దుర్వినియోగం చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్న మంజు […]

  • Ravi Kiran
  • Publish Date - 7:01 pm, Tue, 22 October 19
సినీనటిపై దర్శకుని దాష్టీకం.. రంగంలోకి పోలీసులు

ప్రముఖ మలయాళ దర్శకుడు వి.ఏ శ్రీకుమార్ మీనన్‌పై నటి మంజు వారియర్ పోలీసు కేసు నమోదు చేసింది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు క్యాంపెయినింగ్ చేస్తూ.. తన పరువును తీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన స్నేహితులను బెదిరిస్తున్నారని… అయన నుంచి తనకు ప్రాణహాని ఉందని మంజు వారియర్ కేరళ డీజీపీ లోకనాథ్ బెహెరా‌కు తెలిపారు.

‘మంజు వారియర్ ఫౌండేషన్’ లెటర్ పాడ్స్, బ్లాంక్ చెక్స్‌ను దర్శకుడు శ్రీకుమార్ మీనన్ దుర్వినియోగం చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్న మంజు వారియర్.. ఈ వ్యవహారానికి బలం చేకూరేలా డిజిటల్ ఎవిడెన్స్‌ను కూడా పోలీసులకు అందజేసింది. గతంలో మంజు వారియర్.. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో పలు కళ్యాణ్ జ్యువెలరీ యాడ్స్‌ చేయడమే కాకుండా అతని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పుష్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్స్‌కు కూడా పలు ప్రకటనలు చేసింది. ఇక వీళ్ళిద్దరూ కలిసి ‘ఒడియన్’ అనే సినిమాకు కూడా పని చేశారు.

శ్రీకుమార్ ఒక జర్నలిస్ట్‌ సహాయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తూ.. తన పరువుకు భంగం కలిగేలా ఆర్టికల్స్‌ను ప్రచురిస్తున్నారని మంజు వారియర్ వివరించారు. ‘ఒడియన్’ సినిమా విడుదలైన తర్వాత నుంచి తనపై సోషల్ మీడియా ఎటాక్ జరుగుతూనే ఉందని చెప్పుకొచ్చింది. వాటి నుంచి బయటపడినా… మళ్ళీ శ్రీకుమార్ కొద్దిరోజుల నుంచి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడని.. అతని నుంచి తనకు ఖచ్చితంగా ప్రాణహాని ఉందని మంజు వారియర్ వ్రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘ఒడియన్’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ కావడానికి తానే బాధ్యురాలినని సినిమాకి సంబంధించిన పలు ప్రమోషనల్ ఇంటర్వూస్‌లో శ్రీకుమార్ చెప్పినట్లుగా ఉన్న ఆధారాలను సైతం ఆమె కంప్లైంట్‌కు జత చేశారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.