ఫేమస్ కమెడియన్‌ను చంపేస్తామంటున్న యశ్ ఫ్యాన్స్..ఎందుకంటే..?
కేజిఎఫ్ చిత్రంతో హీరో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అంతకంటే ముందుగానే యష్ కన్నడలో పాపులర్ అయినప్పటికి..కేజీఎఫ్ మాత్రం అతనికి నేషనల్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో యశ్‌కి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే ఆ ఫ్యానిజం ఇప్పుడు ఓ యువ కమెడియన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. యశ్ అభిమానులు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు కమెడియన్ సుదర్శన్ రంగప్రసాద్. రెండు సంవత్సరాల క్రితం ఓ కామెడీ షోలో రంగప్రసాద్.. యశ్ సినిమాలోని ఓ డైలాగ్‌ను […]
కేజిఎఫ్ చిత్రంతో హీరో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అంతకంటే ముందుగానే యష్ కన్నడలో పాపులర్ అయినప్పటికి..కేజీఎఫ్ మాత్రం అతనికి నేషనల్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో యశ్‌కి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే ఆ ఫ్యానిజం ఇప్పుడు ఓ యువ కమెడియన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది.
యశ్ అభిమానులు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు కమెడియన్ సుదర్శన్ రంగప్రసాద్. రెండు సంవత్సరాల క్రితం ఓ కామెడీ షోలో రంగప్రసాద్.. యశ్ సినిమాలోని ఓ డైలాగ్‌ను మిమిక్రీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన యశ్ అభిమానులు రంగప్రసాద్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఆయన బెంగళూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనను వేధించవద్దని యశ్ అభిమానులను కోరారు.
‘నేను యశ్‌తో కలిసి పనిచేశాను. యశ్ అంటే నాకు అభిమానం ఉంది. నేను చేసిన మిమిక్రీని కొందరు తప్పుగా అర్థం చేసుకుని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెబుతున్నాను. జోక్‌ను జోక్‌లాగానే చూడండి సీరియస్‌గా తీసుకోకండి. నేను వేరే వాళ్లని బాధపెట్టడానికో, లేక చులకన చేయడానికో ఆ డైలాగ్ చెప్పలేదు. నాకు తెలిసినంత వరకూ యశ్ కూడా ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడడు. ఆ వీడియో చూసి నన్ను చంపేస్తానంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారు.’ అని రంగప్రసాద్ తెలిపారు.