కత్రినా నయా బిజినెస్.. రంగంలోకి లేడి సూపర్ స్టార్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రీసెంట్‌గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. బీ-టౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న కత్రినా ఇప్పుడు సౌందర్య ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టింది. ‘కే బై కత్రినా’ అనే పేరుతో నయా వ్యాపారాన్ని షురూ చేసింది. ఇక దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతారను రంగంలోకి దింపింది. తాజాగా ఆమెతో ఓ వీడియోను కూడా రూపొందించారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను క్యాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి నయనతారకు […]

కత్రినా నయా బిజినెస్.. రంగంలోకి లేడి సూపర్ స్టార్!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 22, 2019 | 6:39 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రీసెంట్‌గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. బీ-టౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న కత్రినా ఇప్పుడు సౌందర్య ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టింది. ‘కే బై కత్రినా’ అనే పేరుతో నయా వ్యాపారాన్ని షురూ చేసింది. ఇక దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతారను రంగంలోకి దింపింది. తాజాగా ఆమెతో ఓ వీడియోను కూడా రూపొందించారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను క్యాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి నయనతారకు బిగ్ థాంక్స్ చెప్పింది.

‘సినిమాలతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నా బ్రాండ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ముంబై వ‌చ్చిన ద‌క్షిణాది అంద‌మైన తార న‌య‌న‌తార‌కు థ్యాంక్స్‌’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. కాగా, కత్రినా కైఫ్ ప్ర‌స్తుతం అక్షయ్ కుమార్ సరసన ‘సూర్య‌వంశీ’ చిత్రంలో నటిస్తోంది. అటు నయనతార హీరోయిన్‌గా నటించిన ‘బిగిల్’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.