సన్నీ లియోన్ కన్నా ధోనినే డేంజర్.. లిస్ట్‌లో ఇంకా చాలామందే ఉన్నారు..!
మనం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని అసభ్యకర లింక్స్ మనల్ని తెగ ఇరిటేట్ చేస్తాయి. కుటుంబ సభ్యలు పక్కన ఉన్నప్పుడు అలాంటివి కనిపిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోకుండా వాటిని క్లిక్ చేస్తే.. అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లకు దారితీస్తుంటాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం ఇండియాలో ఏ రేంజ్‌లో పెరిగిందో..ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన క్రికెటర్లు, ఫిల్మ్ స్టార్స్, రాజకీయ నాయకుల మల్టీమీడియా సమాచారం కోసం నేటి యువత ఇంటర్నెట్‌ను విపరీతంగా వాడుతోంది. అధికారికంగా విడుదల కానప్పటికీ […]
మనం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని అసభ్యకర లింక్స్ మనల్ని తెగ ఇరిటేట్ చేస్తాయి. కుటుంబ సభ్యలు పక్కన ఉన్నప్పుడు అలాంటివి కనిపిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోకుండా వాటిని క్లిక్ చేస్తే.. అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లకు దారితీస్తుంటాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం ఇండియాలో ఏ రేంజ్‌లో పెరిగిందో..ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన క్రికెటర్లు, ఫిల్మ్ స్టార్స్, రాజకీయ నాయకుల మల్టీమీడియా సమాచారం కోసం నేటి యువత ఇంటర్నెట్‌ను విపరీతంగా వాడుతోంది. అధికారికంగా విడుదల కానప్పటికీ పైరసీ కోసం పాకులాడుతోంది. ఇదే అదనుగా వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి వివరించడం చాలా కష్టం. దీంతో అతని గురించి ఇన్పర్మేషన్ తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఇంట్రస్ట్ చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ ధోనీ ఇంటర్నెట్లో అత్యంత ప్రమాదకర వ్యక్తిగా మారిపోయాడు. అతడి పేరుతో సమాచారం వెతుకుతున్నప్పుడు అత్యంత ఎక్కువగా మాలీసియస్ వెబ్‌సైట్లకు లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సెలెబ్రిటీల జాబితాలో ఎవరెవరున్నారో ఓ నివేదిక సిద్ధం చేసింది. నటి రాధికా ఆప్టె, శ్రద్ధా కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఇందులో మొయిన్‌గా ఉన్నారు.
ఇక ఈ లిస్ట్‌లో బాలీవుడ్ తార సన్నీ లియోన్ నాలుగో స్థానంలో ఉండగా.. టీవీ సెలబ్రిటి గౌతమ్ గులాటి ఆమెకన్నా ముందున్నారు. నెటిజన్లు వీరి క్రీడా పోటీలు, సినిమాలు, టీవీ షోలు, చిత్రాల కోసం ఎక్కువగా వెతుకుతుంటారు. అందరికీ ప్రమాదకర వెబ్‌సైట్లపై అవగాహన ఎక్కువగా ఉండదు. సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ డివైజెస్ నుంచి సులభంగా ఆపరేట్ చేస్తున్నారు. అందుకే మాలీసియస్ వెబ్‌సైట్లు ఇలాంటి సమాచారాన్ని ఎరగా వేస్తున్నాయని మెకాఫీ ఇండియా ఎండీ వెంకట్ కృష్ణాపుర్ తెలిపారు.