పిడుగు పడ్డ తర్వాత చెట్టు లోపల మంటలు…!

కొన్ని సందర్భాల్లో పిడుగుపాటుతో అనుకోకుండా చోటుచేసుకునే సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మన కళ్ల ముందు ఆ దృశ్యం కనిపించినప్పటికీ అది నిజమా కాదా?అని నమ్మలేని సందర్భాలు అనేకం ఉంటాయి. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడటం సహజమే. పిడుగులు పడ్డ ప్రాంతమంతా కాలిపోయి ఉంటుంది. ఆ మెరుపు క్షణాల్లోనే మాయమైపోతోంది. కానీ ఓ చెట్టు వద్ద పిడుగు పడడంతో ఆ చెట్టు కాండం చీల్చుకుపోయి మంటలు అంటుకున్నాయి. ఆ చెట్టు కాండంలో కాసేపు మంటలు మండాయి. […]

పిడుగు పడ్డ తర్వాత చెట్టు లోపల మంటలు...!
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 10:25 PM

కొన్ని సందర్భాల్లో పిడుగుపాటుతో అనుకోకుండా చోటుచేసుకునే సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మన కళ్ల ముందు ఆ దృశ్యం కనిపించినప్పటికీ అది నిజమా కాదా?అని నమ్మలేని సందర్భాలు అనేకం ఉంటాయి. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడటం సహజమే. పిడుగులు పడ్డ ప్రాంతమంతా కాలిపోయి ఉంటుంది. ఆ మెరుపు క్షణాల్లోనే మాయమైపోతోంది. కానీ ఓ చెట్టు వద్ద పిడుగు పడడంతో ఆ చెట్టు కాండం చీల్చుకుపోయి మంటలు అంటుకున్నాయి. ఆ చెట్టు కాండంలో కాసేపు మంటలు మండాయి. ఈ ఘటన టెక్సాస్‌లోని ట్రినిటీలో అక్టోబర్‌ 17వ తేదీన చోటు చేసుకుంది. అయితే ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి మొదట టిక్‌టాక్‌లో షేర్‌ చేశాడు. ఆ తర్వాత దాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అయింది. చెట్టులో మంటలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విచిత్రంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.