ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథేంటో తెలుసా!
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 25 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. భారతదేశం విషయానికొస్తే దాదాపు 15 కోట్ల మంది ప్రజలు సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, అసలు ఈ భూమిపై వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? అతను ఏ దేశానికి చెందినవాడు, మొదటి పంట ఏది? అనే ప్రశ్నలు ఎప్పుడైనా మీ మైండ్‌లోకి వచ్చాయా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, చరిత్రకారుల పరిశోధనలు అద్భుతమైన సమాధానాలను ఇస్తున్నాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు..? మానవాళి మొదటి పంట ఏది.. ? ఇలాంటి ప్రశ్నలకు చరిత్రకారులు, శాస్త్రవేత్తలు సమాధానాలు కనుగొన్నారు. చరిత్ర పుస్తకాల్లో ఆ మొదటి రైతు పేరు నమోదు కానప్పటికీ, దాదాపు 12,000 సంవత్సరాల క్రితమే మానవుడు భూమిలో విత్తనం నాటడం నేర్చుకున్నాడని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ చారిత్రాత్మక మార్పు మధ్యప్రాచ్యంలోని (Middle East) ఫర్టైల్ క్రెసెంట్ అని పిలిచే అత్యంత సారవంతమైన ప్రాంతంలో జరిగింది. నేటి ప్రపంచ పటంలో చూస్తే ఈ ప్రాంతం సిరియా, ఇరాక్, టర్కీ, జొర్డాన్ దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది.
తొలి రైతు ఏ దేశానికి చెందినవాడు?:
చరిత్రకారుల ప్రకారం, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యవసాయ ఆధారాలు నేటి సిరియా, టర్కీ సరిహద్దు ప్రాంతంలో లభించాయి. సిరియాలోని అబూ హురైరా (Abu Hureyra) అనే పురాతన ప్రదేశంలో తొలిసారిగా మనుషులు పంటలు పండించినట్లు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు దొరికాయి. ఆ కాలంలో మనలాంటి దేశాలు లేదా సరిహద్దు రేఖలు లేవు, కేవలం మానవ తెగలు (Tribes) మాత్రమే జీవించేవి. నవీన శిలా యుగానికి (Neolithic Period) చెందిన ఆనాటి మనుషులు, వేట, అడవుల నుండి ఆహారాన్ని సేకరించే క్రమంలో వాతావరణ మార్పులను, నదీ తీరాల్లోని సారవంతమైన మట్టిని గమనించారు.
మొదటి పంట ఏది?:
ఆనాటి మానవులు భూమిపై మొట్టమొదటిసారిగా పండించిన ధాన్యాలు ప్రాచీన గోధుమలు (Wheat), బార్లీ (Barley). ఆ కాలంలో సిరియా ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడటంతో అడవుల్లో సహజంగా దొరికే అడవి ధాన్యాలు తగ్గిపోయాయి. ఆకలి తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయం కోసం చూసిన ఆనాటి ప్రజలు, అడవి గోధుమ గింజలను సేకరించి వాటిని సొంతంగా భూమిలో నాటడం, నీరు పోసి పెంచడం ప్రారంభించారు. గోధుమలు, బార్లీతో పాటు వారు బఠానీలు, మైసూర్ పప్పు (ఎర్ర పప్పు) వంటి పప్పుధాన్యాలను కూడా పండించారు.
ఈ విధంగా ప్రారంభమైన వ్యవసాయం మానవ జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ఆహారం కోసం తిరిగే మనుషులు ఒకే చోట ఇళ్లు నిర్మించుకుని జీవించడం ప్రారంభించారు. ఇది కాలక్రమేణా పెద్ద పెద్ద నగరాలు, గొప్ప నాగరికతల ఏర్పాటుకు దారితీసింది. నేడు సాంకేతికత పెరిగి వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, మానవ మనుగడకు పునాది వేసిన ఆనాటి తొలి రైతు కృషి నిజంగా అమోఘం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…