AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ దిశలో పెట్టడం అత్యంత శుభప్రదం.. ఈ తప్పులు చేయొద్దు

Money Plant ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, వాస్తు శాస్త్రం ప్రకారం సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. నిపుణుల సూచనల ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఓ దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే మనీ ప్లాంట్ తీగలు నేలను తాకకుండా పైకి ఎగబాకేలా చూసుకోవడం, ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తొలగించడం మంచిదని సూచిస్తున్నారు.

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ దిశలో పెట్టడం అత్యంత శుభప్రదం.. ఈ తప్పులు చేయొద్దు
Money Plant Vastu
Shaik Madar Saheb
|

Updated on: Jun 22, 2026 | 7:43 PM

Share

వాస్తవానికి ప్రతి గృహంలో వృక్షాల పెంపకం పర్యావరణానికి మాత్రమే కాకుండా, వాస్తు శాస్త్రం ప్రకారం సానుకూల శక్తి ప్రవాహానికి కూడా ఎంతో అవసరం. కొన్ని మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి, ఆక్సిజన్‌ను అందిస్తాయి.. తద్వారా మన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఆరోగ్యకరంగా మారుస్తాయి.. అలాంటి మొక్కల్లో వేపచెట్టు, తులసి.. పూల మొక్కలు, అలాగే.. మనీ ప్లాంట్ ఉంటాయి.. నిపుణులు చెప్పినట్లు, వేప చెట్టు గాలి ఆరోగ్యాన్నిస్తుంది, సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. అలాగే, తులసి మొక్క ప్రతి గృహంలో తప్పనిసరిగా ఉండవలసిన పవిత్రమైన, ఔషధ గుణాలు కలిగిన వృక్షం.. చామంతి, మల్లె, కనకాంబరం, బ్రహ్మ కమలం, కృష్ణ కమలం, పారిజాతం వంటి పూల మొక్కలు కూడా ఇంటికి అందాన్ని, సానుకూల శక్తిని తీసుకువస్తాయి. అయితే.. మనీ ప్లాంట్ కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తూ ఇంట్లోని నకారాత్మక శక్తులను దూరం చేసే ఒక అద్భుతమైన దైవిక మొక్క అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్కను సరైన దిశల్లో ఉంచితేనే ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందని.. ఈ విషయంలో అశ్రద్ద వద్దని చెబుతున్నారు..

మనీ ప్లాంట్ ఏ దిక్కున ఉంచాలి..?

  1. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంటి ఆగ్నేయ దిశలో పెట్టడం అత్యంత శుభప్రదం అంటున్నారు నిపుణులు… ఈ దిశకు అధిపతి గణేశుడు, శుక్రుడు.. ఇక్కడ ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.
  2. అయితే, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఈశాన్య దిశలో (North-East) పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
  3. మరో విషయం ఏంటంటే.. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకి ఎగబాకేలా చూసుకోవాలి. అవి నేలను తాకకూడదు..
  4. అంతేకాకుండా.. మొక్కలో ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులు ఉంటే వాటిని వెంటనే కత్తిరించాలని.. దీనివల్ల ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పేర్కొంటున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
ఈ వస్తువులను అరువుగా తీసుకోవద్దు! లేదంటే అప్పులు, ఆర్థిక నష్టాలు
ఈ వస్తువులను అరువుగా తీసుకోవద్దు! లేదంటే అప్పులు, ఆర్థిక నష్టాలు
తొలగిన శని దోషం.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
తొలగిన శని దోషం.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?