రోజూ ఈ పండు తింటే వారంలోనే బీపీ నార్మల్ అవుతుంది..
21-06-2026
Pic credit - Instagram
Phani Ch
ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక రక్తపోటు.
రక్తపోటును 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు. సాధారణంగా రక్తపోటు 120/80 మార్కు కంటే ఎక్కువగా ఉంటే జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం.
కేవలం మందులపైనే ఆధారపడకుండా, మన నిత్య జీవితంలో లభించే అరటిపండు ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండులో ఉండే అత్యధిక పొటాషియం నిల్వలు రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటు ఉన్నవారు సోడియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.
అరటిపండులోని పొటాషియం మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి, మూత్రం ద్వారా శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపుతుంది.
వివిధ అధ్యయనాల ప్రకారం, రోజుకు రెండు అరటిపండ్లు తినడం అలవాటు చేసుకుంటే కేవలం ఒక వారం రోజుల్లోనే రక్తపోటు స్థాయిలు 10 శాతం వరకు తగ్గుతాయి.
అరటిపండు కేవలం బీపీని తగ్గించడమే కాకుండా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇందులో కాల్షియం ఎముకలను బలోపేతం చేయగా, విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఉదయాన్నే ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లేవారు బ్రేక్‌ఫాస్ట్ మానేసే బదులు ఒక అరటిపండు తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
దీనిలోని 'ట్రిప్టోఫాన్' అనే మూలకం శరీరంలో హ్యాపీ హార్మోన్ అయిన సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేసి ఒత్తిడిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది.