AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa: కన్నప్ప విజయం కోసం జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్న మంచు విష్ణు..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రం కన్నప్ప. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Kannappa: కన్నప్ప విజయం కోసం జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్న మంచు విష్ణు..
Manchu Vishnu
J Y Nagi Reddy
| Edited By: Rajeev Rayala|

Updated on: Jun 25, 2025 | 7:26 PM

Share

కన్నప్ప సినిమా సక్సెస్ కోసం హీరో మంచు విష్ణు ప్రసిద్ధ జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్నారు. అందులో భాగంగానే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ముందుగా రాజగోపురం దగ్గరికి వచ్చిన హీరో మంచు విష్ణు ని ఆలయ మర్యాదలతో అధికారులు వేద పండితులు స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారికి అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకున్నారు. వేదమంత్రాలతో వేద పండితులు మంచు విష్ణు ను ఆశీర్వదించారు. భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ కన్నప్ప సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. సినిమా సక్సెస్ కోరుకుంటూ మంచు విష్ణు జ్యోతిర్లింగాల యాత్ర చేస్తున్నారు. 12వ యాత్రలో భాగంగా ఈరోజు శ్రీశైలం దర్శనం చేసుకున్నారు. ప్రేక్షకులు కన్నప్ప సినిమా సక్సెస్ కి సహకరించాలని ఆశించారు. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో కుటుంబ ఘర్షణలు, వివాదాలు, ఆస్తుల పంపకాల మధ్య మనస్పర్ధలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నప్ప సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.

ఈ చిత్రం హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి కన్నప్ప సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు, ‘మహాభారతం’ కు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖేష్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నప్ప పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి