AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu manoj: పెళ్లి తర్వాత తొలిసారి శ్రీ విద్యానికేతన్‌కు కొత్త జంట.. మనోజ్‌, మౌనికలకు ఘన స్వాగతం.

సినీ నటుడు మంచు మనోజ్‌, భూమా మౌనికలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌, మౌనిక ఒక్కటయ్యారు. ఇలా తన ఇంట్లో తమ్ముడి వివాహాన్ని..

Manchu manoj: పెళ్లి తర్వాత తొలిసారి శ్రీ విద్యానికేతన్‌కు కొత్త జంట.. మనోజ్‌, మౌనికలకు ఘన స్వాగతం.
Manchu Manoj
Narender Vaitla
|

Updated on: Mar 21, 2023 | 9:58 AM

Share

సినీ నటుడు మంచు మనోజ్‌, భూమా మౌనికలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌, మౌనిక ఒక్కటయ్యారు. ఇలా తన ఇంట్లో తమ్ముడి వివాహాన్ని జరిపించి మనోజ్‌పై తనకున్న ఇష్టాన్ని చెప్పకనే చెప్పారు మంచు లక్ష్మీ. ఇదిలా ఉంటే వివాహం అయిన తర్వాత కర్నూలు వెళ్లిన కొత్త జంట అక్కడ స్వర్గీయ భూమా దంపతుల సమాధులను సందర్శించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లి అయ్యాక తొలిసారి తమ విద్యా సంస్థలైన శ్రీ విద్యానికేతన్‌ను సందర్శించారు. ఆదివారం ఆదివారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌కు వెళ్లారీ కపుల్‌. మనోజ్‌, మౌనికలు ఇన్‌స్టిట్యూట్‌కి రాగానే విద్యార్థులంతా నూతన దంపతులకు ఆహ్వానం పలికారు. మనోజ్‌తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

దీనికి సంబంధించిన వీడియోను మనోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. విద్యాసంస్థలోకి మనోజ్ అడుగు పెట్టగానే విద్యార్థుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అంతేకాకుండా ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకెళ్లారు నూతన వధువరులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విద్యార్థులు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు అంటూ మనోజ్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా