Actor Indrans: 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్షలు రాసిన నటుడు.. కారణం తెలిస్తే షాకవుతారు..

కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే ట్రైలర్ షాపులో వర్క్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఇంద్రన్స్ అనుకోకుండా సినీరంగం వైపు అడుగులు వేశాడు. పాఠశాలకు వెళ్లలేకపోయినప్పటికీ.. ఇంద్రన్స్ కు చదువు అంటే చాలా ఇష్టం. దీంతో చదవడం నేర్చుకున్నాడు. 1980 నుంచి మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Actor Indrans: 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్షలు రాసిన నటుడు.. కారణం తెలిస్తే షాకవుతారు..
Indrans
Follow us

|

Updated on: Aug 24, 2024 | 3:54 PM

మలయాళం సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇంద్రన్స్.. ఈరోజు ఏడవ తరగతి పరీక్షలు రాశాడు. ప్రస్తుతం అతడి వయసు 68 సంవత్సరాలు. కేరళలోని అట్టకులంగర స్కూల్లో విద్యార్థులతో కలిసి 7వ తరగతి పరీక్షలు రాశారు. ఇంద్రన్స్ చిన్నప్పుడు నాలుగో తరగతి వరకే చదువుకున్నాడు. పుస్తకాలు, వేసుకోవడానికి బట్టలు కూడా లేకపోవడంతో పని చేయడం ప్రారంభించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే ట్రైలర్ షాపులో వర్క్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఇంద్రన్స్ అనుకోకుండా సినీరంగం వైపు అడుగులు వేశాడు. పాఠశాలకు వెళ్లలేకపోయినప్పటికీ.. ఇంద్రన్స్ కు చదువు అంటే చాలా ఇష్టం. దీంతో చదవడం నేర్చుకున్నాడు. 1980 నుంచి మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

గతేడాది విడుదలైన 2018 సినిమాలో అంధుడి పాత్రలో నటించాడు. ఈ మూవీలో తన పాత్రకు ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే చిన్నప్పుడు ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోయిన ఇంద్రన్స్ కు పదవ తరగతి పాస్ కావాలనే కోరిక ఉండేది. కానీ పది చదవాలంటే ముందు 7వ తరగతి పాస్ కావాలని రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడవ తరగతి పరీక్షలు రాశాడు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు ముగుస్తుంది. ఈరోజు మలయాళం, ఇంగ్లీష్, హిందీ పరీక్షలు జరుగుతున్నాయి. రేపు సోషల్ సైన్స్, సైన్స్, గణితం పరీక్షలు జరగనున్నారు. మరో రెండు వారాల్లో ఈ పరీక్షల ఫలితాలను ఇవ్వనున్నారు.

ఇంద్రన్స్ 10వ తరగతికి రాగానే కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా అతడిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అతడి పేరును ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు అక్షరాస్యత మిషన్ సిద్ధమవుతుంది. ఇంద్రన్‌కు చదువుపై ఉన్న ఎనలేని అభిరుచి అంబాసిడర్‌గా సామాన్యులకు స్ఫూర్తినిస్తుంది కాబట్టే అతడిని అంబాసిడర్‌గా చేస్తున్నట్టు డైరెక్టర్ ఏజీ ఒలీనా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.