Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా..? పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన ఈ డైలాగ్‌ అప్పట్లో సెన్సేషన్‌. ఇప్పుడు మరోసారి అదే డైలాగ్‌ను ఫ్యాన్స్‌కు గుర్తు చేస్తున్నారు మహేష్‌.

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 2:16 PM

Mahesh Babu: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా..? పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన ఈ డైలాగ్‌ అప్పట్లో సెన్సేషన్‌. ఇప్పుడు మరోసారి అదే డైలాగ్‌ను ఫ్యాన్స్‌కు గుర్తు చేస్తున్నారు మహేష్‌. మే 31న మహేష్ మూవీస్‌కు సంబంధించి అప్‌డేట్స్ ఉంటాయని భావించారు ఫ్యాన్స్.. కానీ పాండమిక్‌ టైమ్‌లో సెలబ్రేషన్ ఎందుకని వాయిదా వేశారు. కానీ కాస్త ఆలస్యమైనా.. తన బర్త్ డేకి మాత్రం డబుల్ ట్రీట్ ఇస్తానంటున్నారు మహేష్. త్రివిక్రమ్ మూవీ ఫార్మల్‌ లాంచింగ్ ఆగస్టు 9న అని మనమే ఎక్స్‌క్లూజివ్‌గా రివీల్ చేశాం. అదే రోజు అంతకు మించి ఖుషీ చేసే మరో అప్‌డేట్ కూడా ఉంటుందన్నది ఫిలిం నగర్‌ టాక్. ఏంటా అప్‌డేట్ అనుకుంటున్నారా.. అదే సర్కారువారి పాట టీజర్‌.

ప్రజెంట్ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ సర్కారువారి పాట. పరుశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సిచ్యుయేషన్‌ కోపరేట్ చేస్తే ఈ మంథ్‌ ఎండ్‌కి మరో షెడ్యూల్‌ను స్టార్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీన్స్‌తో ఓ సాలిడ్‌ టీజర్‌ను రిలీజ్ చేయాలన్నది యూనిట్‌ ప్లాన్‌.. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా.. మహేష్ బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ మాత్రం పక్కా అన్న టాక్‌ గట్టిగానే వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashi Khanna: వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో డిజిట‌ల్ స్క్రీన్‌పై సంద‌డి చేస్తోన్న రాశీఖ‌న్నా… ( వీడియో )

Payal Rajput: బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్… అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన బ్యూటీ.. ( వీడియో )

PSPK 28: మళ్లీ సీన్ రిపీట్ కానుందా.. పవన్ సినిమాలో సమంతా..? క్లారిటీ ఇవ్వని హరీష్