PSPK 28: మళ్లీ సీన్ రిపీట్ కానుందా.. పవన్ సినిమాలో సమంతా..? క్లారిటీ ఇవ్వని హరీష్

Pawan Kalyan - Samantha: ప‌వ‌న్ క‌ల్యాణ్‌ - హ‌రీష్ శంక‌ర్ కాంబోలో మరో మూవీ తెర‌కెక్క‌తున్న విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాపై

PSPK 28: మళ్లీ సీన్ రిపీట్ కానుందా.. పవన్ సినిమాలో సమంతా..? క్లారిటీ ఇవ్వని హరీష్
Pawan Kalyan Samantha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2021 | 9:55 AM

Pawan Kalyan – Samantha: ప‌వ‌న్ క‌ల్యాణ్‌ – హ‌రీష్ శంక‌ర్ కాంబోలో మరో మూవీ తెర‌కెక్క‌తున్న విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. హరీష్ డైరెక్షన్‌లో.. మరో పవన్ గబ్బర్ సింగ్ ఊర్రుతలూగించనుందని అటు సినీ ఇండస్ట్రీ.. ఇటు అభిమానులు కోడై కూస్తున్నారు. కాగా ఈ చిత్ర తారాగణం గురించి ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్‌పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన స‌మంత అయితే బాగుంటుంద‌ని.. మూవీ మేక‌ర్స్ ఆమెను సంప్ర‌దించిన‌ట్టు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 స‌క్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉంది స‌మంత‌. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సమంత గ‌తంలోనే అత్తారింటికి దారేది సినిమాలో న‌టించారు. ఈ హరీష్ సినిమాకు సమంతకు భారీ రెమ్యున‌రేష‌న్ అయితేనే ప్రాజెక్టులో న‌టిస్తుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ సామ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి తెర‌పై సంద‌డి చేయ‌డం ఖాయ‌మైన‌ట్టేనని పేర్కొంటున్నారు. అయితే.. ప‌వ‌న్‌-హ‌రీష్ సినిమాకు సమంతా ఒకే చెప్తుందా..? లేదా అనేది తెలియాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే. ఒకవేళ నో చెబితే.. ఆ అదృష్టం ఎవరికి లభిస్తోందో వేచిచూడాల్సిందే.

Also Read;

Vikram Movie: దుమ్మురేపనున్న ‘విక్రమ్’.. కమల్ మూవీకి ‘కేజీఎఫ్’ స్టంట్ మాస్టర్స్..

Allu Arjun: పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న అల్లు అర్జున్ ఐకాన్ మూవీ..