Vikram Movie: దుమ్మురేపనున్న ‘విక్రమ్’.. కమల్ మూవీకి ‘కేజీఎఫ్’ స్టంట్ మాస్టర్స్..

Kamal Hassan Vikram Movie: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఇండియన్ 2' చిత్రం లేట్

Vikram Movie: దుమ్మురేపనున్న ‘విక్రమ్’.. కమల్ మూవీకి 'కేజీఎఫ్' స్టంట్ మాస్టర్స్..
Kamal Hassan Vikram Movie
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2021 | 9:35 AM

Kamal Hassan Vikram Movie: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రం లేట్ అవుతుండటంతో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లారు కమల్ హాసన్.. లోకనాయకుడి కెరీర్లో వస్తున్న ఈ 232వ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ తో సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొంటున్నాయి సినీవర్గాలు. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ స్టంట్ మాస్టర్స్ అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందివ్వనున్నారు. ఈ విషయాన్ని తాజాగా లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘కేజీఎఫ్’ చిత్రానికి అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన అన్బు-అరివ్.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’, రవితేజ ‘ఖిలాడి’, సూర్య 40 చిత్రాలకు స్టంట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా అన్బు-అరివ్ కమల్ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో లెజండ్ కమల్ తో పనిచేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నామని అన్బు-అరివ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

Also Read:

Kambalapally kathalu : చాప్టర్ 2 కు సిద్దమవుతున్న కంబాలపల్లి కథలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు..

Niharika Konidela: అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న ఐకాన్ స్టార్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న బన్నీ..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?