మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చెర్రీ, ఎన్టీఆర్‌లు..?

మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న బుధవారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి మహేష్ బాబుతో పనిచేసిన దర్శకులందరినీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అలాగే.. ఈ ఈవెంట్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా రామ్‌ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హాజరుకాబోతున్నట్లు సమాచారం. కాగా.. […]

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చెర్రీ, ఎన్టీఆర్‌లు..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 01, 2019 | 11:36 AM

మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న బుధవారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి మహేష్ బాబుతో పనిచేసిన దర్శకులందరినీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అలాగే.. ఈ ఈవెంట్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా రామ్‌ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హాజరుకాబోతున్నట్లు సమాచారం.

కాగా.. వాస్తవానికి గతేడాది భరత్ అనే నేను సినిమా రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరినీ ఆహ్వానించారు మహేష్. అయితే.. అప్పుడు ఎన్టీఆర్ ఒక్కరే హాజరయ్యారు. కాగా.. ఫంక్షన్ ముగిసిన అనంతరం జరిగిన పార్టీలో చెర్రీ జాయిన్ అయ్యాడు. ఈ సారి కూడా ఈ ఇద్దరికీ ఆహ్వానం అందించగా. ఎన్టీఆర్ స్కిప్ చేసే ఆలోచనలో ఉన్నారని, చరణ్ హాజరయ్యే అవకాశం ఉందని టాక్.